COLLECTOR PERSONALLY SUPERVISES MEDARAM JATARA

Collector personally supervises medaram jatara

warangal, Warangal collector, Karuna, Medaram jatara

District Collector Vakati Karuna has got down to business literally - with a stick in hand - she was seen supervising the Medaram Jatara on Thursday. Speaking to mediapersons, she said the district administration is reviewing the crowd movement at regular intervals from time-to-time to prevent any untoward incident.

కర్రపట్టిన కలెక్టరమ్మ

Posted: 02/18/2016 05:03 PM IST
Collector personally supervises medaram jatara

లా అండ్ ఆర్డర్ ను చేతిలో ఉంచుకుంటారు.. ఏదైనా తేడా జరిగితే మొత్తం సర్దుకునేదాకా రంగం నుండి వెనక్కితగ్గరు. అలాంటి పోస్ట్ లో ఉన్న ఓ కలెక్టర్ స్వయంగా కర్రచేతిలో పట్టుకుని హడావిడి చేశారు. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్ కరుణ స్వయంగా రంగంలోకి దిగారు. గద్దెల వద్ద ఆమె కర్ర పట్టి భక్తులను కంట్రోల్ చేశారు. ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సమ్మక్క- సారలమ్మ భక్తులకు మంచినీటిని అందుబాటులో ఉంచామని, ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కాగా కలెక్టరే ఘటనా స్థలం వద్ద ఉండి పరిస్థితిని సమీక్షించటంతో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఇలా ఉండగా.. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఈసారి అవలంబించిన వన్ వే విధానంతో తొలిరోజు సత్ఫలితాలు వచ్చాయి. జాతరకు వచ్చే ప్రయివేట్ వాహనాలను నియంత్రించేందుకు వన్ వే పద్థతిని అమలు చేశారు. దీంతో బుధవారం పస్రా- మేడారం రహదారిపై వాహనాల రద్దీ గణనీయంగా తగ్గింది. వన్ వే పద్ధతికి తోడు ఖమ్మం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం, చత్తీస్-గఢ్‌ నుంచి వచ్చే వాహనాలు చిన్నబోయినపల్లి, మేడారం వైపు మళ్లించడం, కాటారం-కాల్వపల్లి- మేడారం దారిని అభివృద్ధి చేయడం కూడా ట్రాఫిక్ నియంత్రణకు అనుకూలంగా కలిసి వచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : warangal  Warangal collector  Karuna  Medaram jatara  

Other Articles