Rahul Gandhi said that Nationalism is in my blood

Rahul gandhi said that nationalism is in my blood

Rahul gandhi, JNU Row, JNU, JNU Delhi, Congress

"The RSS is trying to impose its flawed ideology on the students of the nation and we won't let that happen", Congress vice-president Rahul Gandhi said on Thursday.

నా రక్తంలోనే దేశభక్తి ఉంది: రాహుల్ గాంధీ

Posted: 02/18/2016 05:05 PM IST
Rahul gandhi said that nationalism is in my blood

రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో  కాంగ్రెస్ ప్రతినిధివర్గం  రాష్ట్రపతిని కలుసుకుంది. జేఎన్‌ యూ వివాదం, ఢిల్లీ కోర్టులో అరాచకం, లాయర్ల దాష్టీకం,  విద్యార్థులు- జర్నలిస్ట్ లపై దాడులు, పోలీసుల ప్రేక్షక పాత్రతో సహా పలు అంశాలపై  కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.  జేఎన్ యూ వివాదంలో   కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల  రాహుల్ తన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీని వెంటనే బర్తరఫ్ చేయాలని రాహుల్  డిమాండ్ చేశారు.

పుణేలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్యార్థుల ఆందోళనతో పాటు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య కేసు పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ప్రతిష్టాత్మక  జేఎన్ యూలో పెచ్చుపెరిగిన వివాదాలు, జరుగుతున్న పరిణామాల వల్ల ప్రపంచానికి చెడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. తన రక్తంలోనే దేశభక్తి ఉందని, తన దేశభక్తిపై ఆరెస్సెస్ సర్టిఫికెట్ అవసరం లేదని రాహుల్ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  JNU Row  JNU  JNU Delhi  Congress  

Other Articles