Chandrababu celebrates Sankranti in naravaipalle with family members

Telugu states celebrate sankranti with pomp

chandrababu, chandrababu Sankranti, chandrababu naravaripalle, naravaripalle sankranti sambaralu, Naravaripalle, Buvaneshwari sankranti sambaralu, Balakrishna sankranti sambaralu, Buvaneshwari naravaripalle, balakrishna naravaripalle, Balakrishna sankranti sambaralu

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu celebrated Sankranti with his family members at his native Naravaripalle village in Chittoor district.

పంచెకట్టుతో సంప్రదాయబద్దంగా చంద్రబాబు సంక్రాంతి సంబరాలు

Posted: 01/15/2016 01:46 PM IST
Telugu states celebrate sankranti with pomp

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు మునుపెన్నడూ లేని విధంగా ఆధ్యాత్మిక చింతన, పండుగలు, శుభకార్యాలకు సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. గతంలో గొప్ప పరిపాలనాధ్యక్షుడిగా పేరు కోసం తాపత్రయపడి.. ఆ మేరకు కీర్తిగడించిన ఆయన మనవడు పుట్టిన వేళావిశేషమేమోగాని మొత్తంగా గుడులు, గోపురాలకు, పండుగలు, పబ్బాలకు కుటుంబసభ్యులతో కలసి పాల్గొంటున్నారు. తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో పండగ సంబరాలలో పాల్గొన్నారు.

పండగలో పాల్గోనేందుకు నిన్న రాత్రికే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు మన సంప్రదాయబద్దమైన బంగారువర్ణపు జెరితో కూడిన తెల్లటి పంచను ధరించి స్థానికులను ఆశ్చర్యచకితులను చేశారు. పంచలోనే తన ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో కలసి హుషారుగా సంక్రాంతి సంబరాల్లో పాల్గోన్నారు. కాగా ఈ వేడుకలలో పాల్గోనేందుకు  చంద్రబాబు కుటుంబం మొత్తం నారావారిపల్లెకు చేరుకుంది.

ఇక చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కూడా మొన్ననే నారావారిపల్లె చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చిన చంద్రబాబుతో బాలయ్య కూడా గ్రామ వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పంచెకట్టుతో బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి ఉదయం గ్రామంలోని నాగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  Sankranti  Naravaripalle  Buvaneshwari  Balakrishna  

Other Articles