MP rayapati comments on party chief chandrababu

Rayapati off the record comments on chandrababu

NarasaraoPet Member of Parliament. Narasaraopet MP Rayapati SambashivaRao, rayapati poll promises, rayapati off the record comments, chandrababu, MP rayapati Sambasiva Rao, Public meeting, Comments, Nara Lokesh, balakrishna, AP Chief Minister Chandrababu, Andhra Pradesh CM chandra babu

NarasaraoPet Member of Parliament Rayapati SambashivaRao says he can"t fullfill his poll promises as the party chief is creating obstacles in his work

టీడీపీలో ఇమడలేకపోతున్నాను.. బాబు గారు అడ్డకుంటున్నారు..

Posted: 01/15/2016 12:10 PM IST
Rayapati off the record comments on chandrababu

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుందుకు ప్రయత్నిస్తుంటే.. అందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబే అడ్డుపడుతున్నారని.. ఈ నేపథ్యంలో తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హామీలను నెరవేర్చడానికి తాను చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ ఆయన ఏదో ఒక మెలిక పెట్టి వెనక్కులాగుతున్నారని రాయపాటి తన మనస్సులోని మాటలను ఉండబట్టలేక బయటపెట్టారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరయిన ఆయన తన గుండెలోతుల్లో వున్న భాధను ఎట్టకేలకు బయటపెట్టారు. ఈ సందర్భంగా  రాయపాటి మాట్లాడుతూ... మాచర్ల, వినుకొండ, గురజాల గ్రామాల్లో నీటి సమస్య  పరిష్కరించేందుకు రూ.1120 కోట్లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు పూనుకున్నానని, ఈ విషయాన్ని యుఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళితే నిధులు లేవన్నారని తెలిపారు.

కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమకు, ఢిల్లీకి అంటీముట్టనట్లుగా ఉందని, అక్కడ తాను గట్టిగా అడిగితే బాబు తిడుతున్నారని (దొబ్బేస్తున్నారని) వాపోయారు. దీంతో అప్పు కోసం బ్యాంకర్లతో మాట్లాడానని, పది నుంచి పదిహేను సంవత్సరాల్లో తీసుకున్న అప్పును 9.6 శాతం వడ్డీతో తిరిగి చెల్లించేందుకు బ్యాంకర్లు ఒప్పుకున్నారని, అయితే చంద్రబాబు 8.5శాతం అయితే ఓకే అంటున్నారని చెప్పారు.

గుంటూరు రైల్వేజోన్‌ కోసం ఒత్తిడి చేద్దామంటే సీఎం కోప్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య తాను సీపీఐ వాళ్లకు భోజనాలు పెడితే, ఎందుకు పెట్టావని పార్టీ వాళ్లు  ప్రశ్నించారని చెప్పారు. ‘ఇక్కడ నేను ఇమడలేకపోతున్నాను.. రత్తయ్య గారూ ఇన్నాళ్లు మీరెలా ఇమిడి ఉండిపోయారు..’ అని అదే వేదికపై ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను ప్రశ్నించారు. చంద్రబాబు తనను తీసుకెళ్లి అడవుల్లో పడేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే తన వ్యాఖ్యలన్నీ ‘ఆఫ్ ది రికార్డ్’ అని, రాయవద్దని బహిరంగసభ చివర్లో రాయపాటి చెప్పడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chief Minister Chandrababu  MP rayapati Sambasiva Rao  Public meeting  Comments  

Other Articles