on assets nitish trails his son nishant and deputy tejaswi yadav

Bihar cm nitish kumar s son is richer than him

Tejaswi Yadav,Tej Pratap,Nitish Kumar,Nishant Kumar,Lalu Prasad,Bihar government,annual assets, Nishant Kumar immovable assets movable assets

Bihar chief minister Nitish Kumar’s son Nishant Kumar is richer than him as far as movable and immovable assets are concerned.

సీఎం కొడుకు కోటీశ్వరుడు.. తండ్రి మాత్రం లక్షాధికారే..

Posted: 01/02/2016 05:38 PM IST
Bihar cm nitish kumar s son is richer than him

బీహార్ లో గూండారాజ్ పాలనకు చెల్లుచీటి ఇచ్చేసిన విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు సాటి రాగల వారెవ్వరూ లేరు. ఇప్పటిదాకా ఆ రాష్ట్రాన్ని ఏలిన సీఎంలు అంతా గూండారాజ్ ను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెంచి పోషించిన వారేనన్న వాదనా లేకపోలేదు. అయితే వారందరికి భిన్నంగా అడుగులేసిన నితీశ్ కుమార్, తొలిసారి అధికారం చేపట్టిన వెంటనే గూండారాజ్ పై కత్తి దూశారు. పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించి తుపాకీ రాజ్యానికి స్వస్తి చెప్పారు. అంతకుముందు పనిచేసిన సీఎంలు అందరూ ఆస్తులు కూడబెట్టుకుంటే, నితీశ్ మాత్రం మిస్టర్ క్లీన్ అనే బిరుదు మాత్రం అందుకున్నారు.

ఇక ఆస్తుల విషయానికి వస్తే.... నితీశ్ కుమార్ ఆస్తుల విలువ కేవలం 59.3 లక్షలేనట. అదే ఆయన పుత్రరత్నం నిశాంత్ కుమార్ పేరిట రూ.2.14 కోట్ల ఆస్తులున్నాయట. అంటే సీఎంగా ఉన్న తన తండ్రి కంటే కూడా నిశాంత్ కుమార్ మూడు రెట్ల మేర అధికంగా ఆస్తులు కలిగి ఉన్నాడు. ఇక నితీశ్ కుమార్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ కు రూ.1.12 కోట్లు ఉన్నాయి. అంటే, సీఎం కంటే డిప్యూటీ సీఎం ఆస్తుల విలువ రెట్టింపన్నమాట.

సీఎం కంటే రెట్టింపు ఆస్తులున్న డిప్యూటీ సీఎంకు మాత్రం సొంత కారు లేదట. ఇక లాలూ పెద్ద కొడుకు, బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు రూ.1.5 కోట్ల ఆస్తులున్నాయట. తేజస్వీకి సింగిల్ కారు లేకున్నా, తేజ్ ప్రతాప్ కు మాత్రం రూ.30 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు, రూ.15.4 లక్షల విలువ చేసే బైకు ఉన్నాయని పేర్కోన్నారు. జల వనరుల శాఖ మంత్రి లల్లన్ సింగ్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించారు. ఆయన ఆస్తుల విలువ రూ. 4.4 కోట్లు. కాగా, చివరి స్థానంలో మంత్రి అనితాదేవి ఉన్నారు. ఆస్తుల విలువ రూ.8.4 లక్షలతో అనితా దేవి చిట్టచివర నిలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar cabinet  Nitish kumar  Nishant kumar  Deputy Tejaswi Yadav  

Other Articles