cpi-leader-narayana-dance-at-new-year-celebrations

Politician nayarana enjoys new year eve goes viral

cpi national polit bureau member DR. Narayana, cpi narayana new year, Narayana new year eve, Narayana dancing, narayana stage video, Narayana dacing video viral, narayana social media

cpi national polit bureau member DR. Narayana enjoys new year eve, by dancing on the stage video goes viral on social media

సంబరాల్లో స్టెపులెసీన నారాయణ.. నెట్టింట్లో వీడియో

Posted: 01/02/2016 05:28 PM IST
Politician nayarana enjoys new year eve goes viral

పాత ఏడాదిని సాగనంపుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. జరిగే వేడుకలు అన్ని వర్గాల వారిని ఉత్సాహాన్ని కలిగించి.. వారిని మైమరిపిస్తాయనడంలో సందేహం లేదు. నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ పాలబుగ్గల చిన్నారి నుంచి ముసలి ముతక వారి వరకు అన్ని వర్గాల వారు వారి వారి స్థాయిలో ఎంజాయ్ చేశారనడంలో సందేహమే లేదు. అటు సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాల నుంచి చిరు వ్యాపారుల వరకు ఇలా అన్ని రంగాల ప్రముఖులలోను నూతన వత్సర సంబరాలు రంజిపజేస్తాయనడంలో అనుమానమే లేదు. ఎంతటి వారినైనా ఈ సంబరాలు హుషారెక్కించి.. వారితో స్టెపులేయిస్తాయి.

ఇందుకు నిలువెత్తు ఉదాహరణ జాతీయ పాలిట్ బ్యూరో సభ్యడు నారయణ. ఎందుకలా అంటారా..? హుస్సేన్ సాగర్లోని ఖైరున్నీసా బోట్ లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన అనందంగా, ఉత్సహాంగా స్టెప్పులేసి సరదాగా గడిపారు.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కేక్ కట్ చేసి పార్టీ నేతలకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నారాయణ ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆడిపాడీ పార్టీ నేతలను, కార్యకర్తలను అలరించారు. దీంతో ఇతర నేతలు, కార్యకర్తలు ఆయనతో కలిసి సరదాగా కాలు కదిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సుధాకర్, గెల్వయ్య తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : CPI  narayana  new year celebrations  hussain sagar  social media  

Other Articles