మాఫియా డాన్ చోటా రాజన్ ను మట్టుబెట్టి తీరతామని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడి భుజం చోటా షకీల్ ప్రకటించాడు. పాక్ లోని కరాచీలో జరగనున్న దావూద్ షష్టి పూర్తి సందర్భాన్ని పురస్కరించుకుని చోటా షకీల్ ‘మెయిల్ టుడే’ ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడాడు. వయసు మీద పడ్డ దావూద్ తన నేర సామ్రాజ్య బాధ్యతలు తన సోదరుడు అనీస్ ఇబ్రహీంకు అప్పజెప్పి, విశ్రాంతి తీసుకోనున్నాడని జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే దావూద్ రిటైర్ కావడం లేదని. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న దావూద్, ఇంకా చలాకీగానే ఉన్నాడని. అంతేకాక తన నేర సామ్రాజ్యాన్ని ఇకపైనా అతడే ఏలుతాడట. ఈ మేరకు అతడి అత్యంత సన్నిహితుడు చోటా షకీల్ కీలక ప్రకటన చేశాడు.
ఎప్పటికీ భయ్యానే తమ బాస్ గా ఉంటాడని చోటా షకీల్ ప్రకటించాడు. అయినా భయ్యాకు ప్రత్యామ్నాయమేదీ లేదని కూడా అతడు కుండబద్దలు కొట్టాడు. దావూద్ 60వ జన్మదిన వేడుకల తీరుపైనా షకీల్ ఒకింత స్పష్టత ఇచ్చాడు. దావూద్ బర్త్ డే సందర్భంగా పెద్ద పార్టీ జరుగుతుందని మీడియాలో వస్తున్న కథనాలను అతడు కొట్టిపారేశాడు. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే దావూద్ కేక్ కట్ చేస్తాడని తెలిపాడు. ఈ వేడుకకు బయటి వ్యక్తులెవరూ హాజరు కావడం లేదని కూడా అతడు పేర్కొన్నాడు. అయితే ఈ వేడుకలు మాత్రం కరాచీలోని దావూద్ ఇంటిలోనే జరుగుతున్నాయని షకీల్ చెప్పాడు.
ఈ సందర్భంగా చోటా రాజన్ తో తమకున్న వైరాన్ని మరోమారు అతడు ప్రస్తావించాడు. ఇప్పటికే పలుమార్లు రాజన్ ను అంతమొందించేందుకు యత్నించామని, అయితే ప్రతిసారీ అతడు తృటితో తప్పించుకున్నాడని షకీల్ పేర్కొన్నాడు. బాలిలో ఇండోనేసియా పోలీసుల అదుపులో ఉన్నప్పుడే రాజన్ ను లేపేసేందుకు పక్కా ప్రణాళిక వేశామని, అయితే అందుకు అవసరమైన ఆయుధాలు చేతికందడంలో జాప్యం జరిగిన కారణంగా అతడు తప్పించుకున్నాడని షకీల్ చెప్పాడు. ఈ విషయంలో తాము విఫలం కాలేదని పేర్కొన్న షకీల్, ఎప్పటికైనా చోటా రాజన్ ను మట్టుబెట్టి తీరతామని చెప్పాడు. జైల్లో ఉన్నాను కదా, సురక్షితంగానే ఉన్నానని రాజన్ అనుకుంటే పొరపాటేనన్నాడు. తీహార్ జైల్లోనే అతడిని లేపేస్తామని షకీల్ పేర్కొన్నాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more