vangaveeti radha krishna pays tribute to vangaveeti mohana ranga

Vangaveeti radha challenges devineni nehru on vangaveeti mohana ranga death anniverasry

vangaveeti mohana ranga death anniverasry, vangaveeti radha challenges devineni nehru, vangaveeti mohana ranga devineni nehru, Vangaveeti Mohana Ranga, Ex MLA, Vangaveeti Radha Krishna, ysrcp leader, vijayawada politics on high flame,

vangaveeti radha krishna pays tribute to vangaveeti mohana ranga on his death anniverasry, and challenges devineni nehru, we are ready to lose once again

నా సహనాన్ని చేతకాని తనంగా బావించవద్దు.. వంగవీటి రాధా హెచ్చరిక..

Posted: 12/26/2015 01:58 PM IST
Vangaveeti radha challenges devineni nehru on vangaveeti mohana ranga death anniverasry

విజయవాడ రాజకీయం మళ్లీ వేడెక్కింది. కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూపై దివంగత వంగవీటి రంగా కుమారుడు, వైకాపా నేత వంగవీటి రాధాకృష్ణ నిప్పులు చెరిగారు. తమ సహనాన్ని చేతకాని తనంగా తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తన తండ్రిపై పిచ్చి వాగుడును నెహ్రూ మానుకోవాలని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం హీరోయిజం అనుకుంటున్నారని మండిపడ్డారు. రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదని ఆయన తెలిపారు. తన తండ్రి రంగాపై అసంబద్ధమైన విమర్శలు ఎవరు చేసినా సహించమని రాధాకృష్ణ స్పష్టం చేశారు. కొందరు కనుసైగలతో రాజకీయం చేస్తున్నట్టు... ఇంట్లో కూర్చొని పిచ్చి భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు.

నెహ్రూ వల్లే తమ కుటుంబం గతంలో నష్టపోయిందని... అయినా, ఎవరికీ నష్టం కలగకూడదనే తాము సైలెంట్ గా ఉన్నామని... అలా కాని పక్షంలో, తాము మరోమారు నష్టపోవడానికైనా సిద్దమేనని, మీరు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. తాము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రంగా 27వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాధా పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవినేని నెహ్రూపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాగా రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా రాధాకృష్ణ ప్రారంభించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vangaveeti Mohana Ranga  Ex MLA  Vangaveeti Radha Krishna  ysrcp leader  

Other Articles