World's fattest man Andres Moreno Sepulveda dies of heart failure

World s fattest man andres moreno dies in mexico

worlds fattest man, mexico, andres moreno, ciudad obregon, dead, 33, Mexico, heavy weight person, obesity, andren morino, Central America and the Caribbean,World News

Andres Moreno, who at his heaviest weighed 70 stone, died of a heart attack on Christmas Day

ప్రపంచ స్థూలకాయుడు అండ్రెన్ మోరినో మృతి

Posted: 12/26/2015 01:19 PM IST
World s fattest man andres moreno dies in mexico

ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడుగా పేరుగాంచిన అండ్రెన్ మోరినో (38) మృతిచెందారు. మెక్సికో సిటీకి చెందిన ఆండ్రెస్ మోరోనో గుండెనొప్పి కారణంగా చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 450 కిలోల బరువు ఉండే ఆండ్రెస్ మోరినో గత రెండు నెలల కిందట బరువు తగ్గేందుకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడని స్థానిక వార్తా ఏజెన్సీ తెలిపింది. సర్జరీ తరువాత ఆండ్రెస్ దాదాపు 100 కిలోలు బరువు తగ్గాడట.

దాంతో అప్పటి నుంచి అతను మామూలుగానే జీవిస్తున్నాడని, అయితే క్రిస్మస్ రోజున హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు వివరించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు తెలిపారు. ఆయన వయస్సు 38 సంవత్సరాలు. మోరినో బరువు 450 కిలోలు. స్థూలకాయమే అతన్ని చిన్నవయస్సులోనే నూరేళ్లు నిండేలా చేసిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heavy weight person  obesity  andren morino  

Other Articles