want pm to tell me what my fault is says suspended bjp lawmaker kirti azad

Evidence vanishing alleges kirti azad suspended by bjp for taking on arun jaitley

DDCA,Kirti Azad,DDCA scam,DDCA Arun Jaitley,Kirti Azad Suspension,Kirti Azad expelled,Kirti Azad on DDCA,PM Modi, Want PM To Tell Me , What My Fault , Suspended

Cricketer-turned-politician Kirti Azad, who has been suspended by the BJP after his unprecedented offensive against Finance Minister Arun Jaitley, said today that he wanted answers from Prime Minister Narendra Modi.

డీడీసీఏకు, బీజేపి పార్టీకి ఎలా లంకెకట్టారు..?

Posted: 12/24/2015 01:20 PM IST
Evidence vanishing alleges kirti azad suspended by bjp for taking on arun jaitley

ఢిల్లీ డిస్ట్రిక్టట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అవినీతి ఆరోపణల నేపథ్యంలో తాను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి సంబంధించిన కొత్త అంశాలేమీ మాట్లాడలేదని బహిష్కృత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ స్పష్టం చేశారు. తాను గతంలో చెసిన అరోపణలే మళ్లీ చేశానని, అరుణ్ జైట్లీ ఈ కేసులో తనపై ఎందుకు పరువు నష్టం దావా వేయలేదని ఆయన ప్రశ్నించానన్నారు. సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని తనను.. ఎలా సస్పెండ్ చేశారో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. డిడిసీఏ అవినీతి అరోపణలకు సంబంధించిన విషయానికి.. బీజేపీ పార్టీకి ఎలా లంకకడుతున్నారని ఆయన నిలదీశారు. తనను సస్పెండ్ చేయడం వల్ల వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం లేదని తెలిపారు.

తనకు పార్టీ నుంచి సస్పెన్షన్ నోటీసు అందిందని భారతీయ జనతాపార్టీ రాజ్యసభ సభ్యుడు కీర్తి ఆజాద్ తెలిపారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడానికి డ్రాప్ట్ సిద్ధం చేస్తున్నానని, సుబ్రహ్మణ్యస్వామి దానికి సహకరిస్తున్నారని వెల్లడించారు. డీడీసీఏ అంశంతో బీజేపీకి సంబంధంలేదని ఎంపీ తేల్చి చెప్పారు. నేను ఏ వ్యక్తిని తప్పుబట్టలేదు. జరిగిన తప్పును మాత్రమే ఎత్తి చూపానని పేర్కొన్నారు. నేను చేసిన తప్పేంటో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. డీడీసీఏ వ్యవహారంలో ఆప్‌కు మద్దతు పలుకుతూ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీపై చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ అధిష్టానం కీర్తి ఆజాద్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP Lawmaker  Kirti Azad  PM Modi  Amit shah  arun jaitley  

Other Articles