Sachin Tendulkar: Despite poor attendance in Parliament, legend aware of his duties

Sachin tendulkar story of poor rajya sabha record with impressive performances

sachin tendulkar,sachin tendulkar rajya sabha member, sachin tendulkar parliament, tendulkar responsibilities, tendulkar mp duties, tendulkar rajya sabha attendence, Rajya Sabha, Sarbananda Sonowal, Narendra Modi, Swachh Bharat,

member of the Rajya Sabha. Tendulkar, who has mostly been absent from the Parliament is known to show care and responsible towards his duties as MP.

క్రికెటర్ గానే కాదు.. పార్లమెంటేరియన్ గా కూడా సచిన్ రికార్డులే..!

Posted: 12/24/2015 01:18 PM IST
Sachin tendulkar story of poor rajya sabha record with impressive performances

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్‌లోనే కాకుండా ఎంపీగానూ రికార్డు సృష్టించారు. సభకు హారయినది అందరికన్నా తక్కువే అయినా.. ఎంపీగా తన బాధ్యతను నిర్వహించడంలో మాత్రమం మిగతావారికన్నా మేలనిపించారు ఈ క్రికెట్ దిగ్గజం. తనకు కేటాయించిన ఎంపీల్యాండ్స్ నిధుల వినియోగంలో ఇతర ఎంపీకంటే సచిన్ ముందున్నారు. తన ఎంపీల్యాండ్స్ నిధుల్లో ఇప్పటివరకు 98 శాతం ప్రజా అవసరాల కోసం ఖర్చు చేశారు. ఏపీలో తాను దత్తత తీసుకున్న పీఆర్ కండ్రిగ గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ప్రాజెక్టుల కోసం తన ఎంపీల్యాండ్స్ నిధులను సచిన్ విడుల చేశారు. అంతేకాకుండా మొన్నటి వరదల్లో అతలాకుతలం అయిన చెన్నైని ఆదుకునేందుకు రూ. 50 లక్షలను సచిన్ అందజేశారు.
 
సచిన్ రాజ్యసభకు నామినేట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు సభా సమావేశాలు జరిగాయి. మొత్తంగా 235 రోజులు జరిగిన సభకు సచిన్ కేవలం 13 రోజులు మాత్రమే హాజరయ్యారు. 11వ సభా సమావేశాల వరకు సభలో మాట్లాడని సచిన్.. 12వ సెషన్‌లో ఏకంగా ఏడు ప్రశ్నలు సంధించారు. సచిన్ ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఎంపీల్యాండ్స్ నిధుల వినియోగంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధించడంలోనూ మిగిలిన ఎంపీకన్నా బెటర్ అనిపించుకుని సచిన్ ఓ రికార్డు సృష్టించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin tendulkar  Rajya Sabha  Sarbananda Sonowal  Narendra Modi  Swachh Bharat  

Other Articles