Railways Increases Charges For Booking Tickets Under Tatkal

Railways hike tatkal charges from december 25

tatkal ticket hike, rail fare hike, indian railways, rail fare hike, rail fare increase, indian railways news, tatkal ticket booking, tatkal booking, sleeper class fare, second class tatkal charges, railways news, railways fare hike,

While a passenger has to shell out Rs 200 for the Tatkal booking of Sleeper class instead of Rs 175, for AC-3 the maximum revised charge is Rs 400 instead of Rs 350 earlier and minimum is Rs 300 instead of Rs 250, according to the Railway notification.

మరోమారు బాదేసిన కేంద్రమంత్రి సురేష్ ప్రభు..

Posted: 12/24/2015 01:21 PM IST
Railways hike tatkal charges from december 25

కేంద్రమంత్రి సురేష్ ప్రభు మరోమారు రైలు ప్రయాణికులను బాదేసారు. ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో భాగంగా చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో ప్రయాణికుల నుంచి ముక్కు పిండీ మరీ డబ్బులు వసూలు చేయాలన్ని నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇందులో బాగంగానే రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే బడ్జెట్ ముందు చార్జీలను వాయించిన కేంద్ర మంత్రి.. తాజాగా.. రైల్వే శాఖ తత్కాల్ టికెట్ ఛార్జీలను పెంచుతూ నిర్నయం తీసుకున్నారు. రేపటి నుంచి ఛార్జీల పెంపు అమలులోకి రానుంది.

ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ తత్కాల్ ఛార్జ్ పెంచినట్లు తెలుస్తోంది. స్లీపర్ క్లాస్ తత్కాల్ బుకింగ్ కోసం గతంలో కనీసం రూ.175 ఛార్జ్ ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.200కు పెంచారు. థార్డ్ ఏసీ ఛార్జీని రూ.350 నుంచి రూ.400 వరకు పెంచారు. థార్డ్ ఏసీ కనీస తత్కాల్ ఛార్జీని కూడా రూ.250 నుంచి రూ.300కు పెంచారు. స్లీపర్ క్లాస్‌లో కనీస ఛార్జ్ గతంలో రూ. 90 ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.100కు పెంచారు. ఎక్కువ శాతం ఏసీ క్లాస్‌కు మాత్రమే రైల్వే శాఖ ఛార్జీలు పెంచింది. సెకండ్ క్లాస్ తత్కాల్ ఛార్జీల్లో పెద్దగా మార్పులు చేయలేదు. సెకండ్ ఏసీ ప్రయాణికులకు ఇప్పుడు తత్కాల్ టికెట్‌ను కనీసం రూ.400కు పెంచారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tatkal charges  railway  PM Modi  Suresh prabhu  

Other Articles