Theft in a police and the Robber is police man wife

Theft in a police and the robber is police man wife

Police, Theft, robber, Police wife as robber

Theft in a police and the Robber is police man wife. A police offier complaints that theft in his house and the robber is his wife.

పోలీస్ ఇంట్లో దొంగ. ఆ పోలీస్ భార్యే దొంగ..?

Posted: 12/24/2015 01:16 PM IST
Theft in a police and the robber is police man wife

ఎవరింట్లోనైనా దొంగతనాలు, దోపిడీలు జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు ప్రజలు. మరి ఆ పోలీస్ ఇంట్లోనే చోరీ జరిగితే? అటువంటి సంఘటనే ఎదురైంది పీలేరు ఎస్సై రాజశేఖర్ కి. రాజశేఖర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో ఆ ఎస్సై తాను పనిచేస్తున్న స్టేషన్ లోనే ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో 46 వేల బంగారు ఆభరణాలతోపాటు కెమెరా, సర్టిఫికెట్లు చోరీ అయినట్లు పేర్కొన్నాడు. ఇందులో విచిత్రమేముంది అని అనుకుంటున్నారా?ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

Also Read: మహిళలే.. పేకాట ఆడుతూ అడ్డంగా బుక్ అయ్యారు

ఇక్కడ దొంగతనం చేసింది ఎవరో మీకు తెలిస్తే కళ్లే తేలేస్తారు.. ఎందుకంటే దొంగతనం చేసింది పోలీస్ భార్యే. తన ఇంట్లో చోరీ చేసింది ఎవరో కాదని… తన భార్య శోభారాణి, ఆమె తరపు బంధువులేనని ఫిర్యాదులో స్పష్టం చేశాడు.  మరో విచిత్రమేంటంటే… శోభరాణి చిత్తూరు కార్యాలయంలో అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డిని కలిసి, తన భర్త తనని వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఎస్సై రాజశేఖర్ కి, అతని భార్య శోభారాణి మధ్య విభేదాలున్నాయని దర్యాప్తులో తేలింది. దీనిపై ఆమెకు ఏఎస్పీ కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు, ఎస్‌ఐ రాజశేఖర్‌ పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Theft  robber  Police wife as robber  

Other Articles