Nirbhaya case: SC shares concern but refuses to stay juvenile convict's release

Nirbhaya gangrape supreme court refuses to stay juvenile s release

wati Maliwal, Supreme Court, Nirbhaya gang-rape case,, juvenile convict, DCW, juvenile, rapist, Nirbhaya, delhi gangrape, released

Supreme Court rejected a petition filed by the Delhi Commission for Women against the release of the juvenile convict in Nirbhaya gang-rape case, saying it "shared" the concern of general citizens' but its hands were "tied" by the law.

మార్పులు తీసుకురాకుండా పార్లమెంట్ చేతులు కట్టేసింది..

Posted: 12/21/2015 08:27 PM IST
Nirbhaya gangrape supreme court refuses to stay juvenile s release

బాల నేరస్తుల చట్టాల్లో మార్పులు తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం తమను ఇరకాటంలో పడేస్తుందని దేశ అ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మూడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషుల్లో ఒకరైన బాల నేరస్తుడు (ప్రస్తుతం 20 ఏళ్లు) అని.. సదరు దోషిని విడుదల చేయకుండా జైలులోనే ఉంచేలా చూడాలన్న ఢిల్లీ మహిళా కమిషన్ వేసిన పిటిషన్ ను ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేసింది. అవేంటంటే..

*    మీరు అభ్యర్థించినట్లుగా ఏ చట్టం ప్రకారం మేం ఇంకా అతడిని అదుపులో ఉంచుకోగలం*   ఏదైనా జరిగిందంటే అది చట్టానికి లోబడే, చట్ట ప్రకారమే జరిగింది. మేం చట్టానికి అతీతులం కాదు
*    రాజ్యాంగంలోని 21 నిబంధన ప్రకారం ఒక వ్యక్తి హక్కును మేం హరించలేము. చట్టంలో అలాంటి అవకాశం పొందుపరచలేదు.
*    మేం మీ ఆందోళనను అర్ధం చేసుకోగలం.. కానీ, ఈ కేసులో చట్టం మూడేళ్లకు మించి బాల నేరస్తుడిని అదుపులో ఉంచుకునేందుకు అనుమతించదు
*    ఒక వేళ ప్రభుత్వం ఆ మేరకు చట్టంలో మార్పులు చేసే క్రమంలో ఏడు నుంచి పదేళ్ల సమయం పడితే అప్పటి వరకు అతడిని అదుపులో ఉంచుకోగలమా? ఆ విధంగా చేసేందుకు మాకు చట్ట      అనుమతి ఏది? అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  juvenile  rapist  Nirbhaya  delhi gangrape  released  

Other Articles