si nageshwar behaves arrogant towards devotees in tirumala

Si nageshwar misbehaves with devotees at tirumala

SI nageswar, arrogant behavior, devotees, vikunta ekadashi, tirumala, tirumala tirupathi devasthanam, vaikunta ekadasi arrogant si, tirumala arrogant si,

si nageshwar who was deputed on tirumala tirupathi devasthanam special duty for vaikunta ekadasi misbehaves with devotees at tirumala

శ్రీవారి భక్తులను కాల్చిపారేస్తానన్న పోలీసు

Posted: 12/21/2015 08:24 PM IST
Si nageshwar misbehaves with devotees at tirumala

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇలలో వేలసిన భూలోక వైకుంఠ దైవాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామీని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాధిగా తరలివచ్చిన భక్తుల పట్ల ఓ ఎస్సై అనుచితంగా ప్రవర్తించాడు. చిన్న సమాచారం అడిగిన పాపానికి భక్తులపై అంతెత్తుఎగిరిపడ్డ ఆ ఎస్సై.. సర్వీస్ రివాల్వర్ చూపించి కాల్చిపారేస్తానంటూ బెదిరించాడు. సోమవారం తిరుమల తిరుపతి దేవస్తానంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

ఏకాదశి సందర్భంగా విజయవాడకు చెందిన కొందరు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. జేఈవో ఆఫీసుకు ఎలా వెళ్లాలో తెలియక.. పక్కనే ఉన్న ఎస్ఐ నాగేశ్వర్ ను అడిగారు. అంతే, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో భక్తులపై విరుచుకుపడ్డారు ఎస్సై నాగేశ్వర్. సర్వీస్ రివాల్వర్ బయటికి తీసి కాల్చేస్తానని బెదిరించాడు. ఎస్సై చర్యను నిరసిస్తూ భక్తులు వాగ్వాదానికి దిగారు. అక్కడికక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ డీఎస్సీ భక్తులకు సర్దిచెప్పి పంపించారు. సదరు ఎస్సై నాగేశ్వర్.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిప్యూటేషన్ పై తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SI nageswar  arrogant behavior  devotees  vikunta ekadashi  tirumala  

Other Articles