ap governement doing unethical things sujayakrishna rangarao

Ycp mla sujayakrishna rangarao slams tdp government

YS Jagan Mohan Reddy, YSRCP, MLA Roja, ap assembly sessions, YSRCP MLA sujayakrishna rangarao, call money, Yanamala ramakrishnudu, call money case, call money scam, call money scandal, call money

YSRCP mla sujayakrishna rangarao slams TDP Government says Andhra Pradesh Government doing unethical things

ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తే.. ఏడాది సస్పెన్షన్..

Posted: 12/21/2015 08:28 PM IST
Ycp mla sujayakrishna rangarao slams tdp government

నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయకృష్ణ రంగారావు అన్నారు. ప్రతిపక్షం గొంతును రెండు చేతులతో నెక్కుతూ.. పైకి మాత్రం మీరు మాట్లాడండీ, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపండీ అంటూ ప్రభుత్వం తమను అడుగుతుందని.. ఆయన మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే రోజాపై సస్పెన్షన్ వేవారని అన్నారు. వాస్తవానికి ఆమెపై వేటు నిబంధనలకు వ్యతిరేకం అని ఆయన అన్నారు.

రోజా పై సస్పెన్షన్ అంశాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ప్రభుత్వ తీరు దురదృష్టకరమని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అనే అంశం మహిళకు సంబంధించినదని, ఇందులో ఎక్కువమంది దళిత బాధితులే ఉన్నారని, ఈ విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వానికి వివరించి వారి కళ్లు తెరిపించాలనే ప్రయత్నంతోనే తమ నేత రోజా మాట్లాడారని, ఎక్కడ దోషులుగా దొరికిపోతామో అన్న భయంతో ఆమెపై ప్రభుత్వం అక్రమంగా సస్పెన్షన్ వేటు వేసిందని చెప్పారు. యనమల రామకృష్ణ నిబంధనలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  MLA Roja  ap assembly sessions  sujayakrishna rangarao  call money  

Other Articles