Indian Railways rule out half tickets for children below 12 years; to be effective from April 2016

Indian railways rule out half tickets for children

IRCTC, Railway Fare, Indian Railway, Rail Fare Hike, Prime Minister Narendra Modi, Railway Minister Suresh Prabhu, Half Tickets Railways, railways new rule issued, april 2016, suresh prabhu, privatization, ticket Prices, Tatkal scheme

According to new rule, the passengers traveling with their children, aged above 5 and between 12, will have to pay the full fare.

బడ్జెట్ కు ముందుగానే మళ్లీ వాయిస్తున్న రైల్వే.. రైల్వే టిక్కెట్లలో చిన్నా, పెద్ద తేడా వుండదు

Posted: 12/05/2015 11:45 AM IST
Indian railways rule out half tickets for children

కేంద్రంలో కోలువుదీరిన నరేంద్రమోడీ ప్రభుత్వం స్థబ్దుగా తన పెంపు కార్యక్రమాలను చేపడుతూనే వుంది. మొన్నటికి మొన్న స్వచ్చా భారత్ సెస్ దేశ ప్రజలపై రుద్దిన కేంద్రం.. జీ ఎస్ టీ పేరుతో మరో బిల్లును కూడా పార్లమెంటులో పాస్ చేయించుకునేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ బిల్లు పాస్ అయితే ప్రజలపై అదనంగా కొంత పన్ను భారం పడుతుందని అర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ లోపు ఇటు రైల్వే శాఖ మరోసారి ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్ధమైంది.

రైల్వేలలో టిక్కెట్ లభించడం సులువే కానీ, బెర్త్ కన్ ఫామ్ కావడం మాత్రం కష్టమేనన్న విమర్శలు వస్తున్నాయి. సంస్కరణల పేరుతో టికెట్ ధరల పట్టికను సవరించిన రైల్వే శాఖ, ఆదాయం మరింత పెంచుకునేందుకు రిజర్వేషన్ల ఉపసంహరణ ధరలను అమాంతం పెంచేసింది. అయితే ప్రయాణికులు టిక్కెట్ ను రద్దు చేసుకుంటే విధించే ధరలు.. రైల్వే శాఖ నుంచి టిక్కెట్టు బుక్ చేసుకున్న ప్రయాణికులకు టిక్కెట్టు రద్దయితే మాత్రం ఆ శాఖ ప్రయాణికులకు తిరిగి చెల్లించే డబ్బులో మాత్రం పెంపు కనబడటం లేదు. అంతేకాదు ప్రయాణికులు చెల్లించిన మొత్తం నుంచి అవి ఇవి అంటూ కొంత మిహనాయించుకుని ఆ తరువాత మూడు నెలలకు డబ్బును ఖాతాలో జమచేస్తున్నారు. ఈ మొత్తం ఒక్కోసారి ఆరు నెలల సమయం కూడా పడుతుంది.

రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కోరుతున్న రైల్వే శాఖ, వివిధ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా మరిన్ని నిధులు రాబట్టాలని భావిస్తోంది. ఇంతలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు రవాణా వ్యవస్థలో 5 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు హాఫ్ టికెట్ విధానం అమలులో ఉండేది. ఇకపై అర్ధ ఛార్జీ అనే మాట ఉండదని రైల్వే శాఖ చెబుతోంది. ఈ మేరకు నిబంధనలు సవరించనుంది. 5 ఏళ్లు దాటిన ఎవరైనా రైలెక్కితే పూర్తి ఛార్జీ చెల్లించాల్సిందేనని రైల్వే శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ నిబంధన 2016 ఏప్రిల్ నుంచి అమలులోకి రానుందని వారు వివరిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IRCTC  Railway Fare  Indian Railway  Half Tickets  

Other Articles