Australian Brewer Recalls ten lakh Beers

Australian brewer recalls ten lakh beers

Beer, Australia, SABMiller, Carlton Dry, Beers recall

More than 1 million bottles of beer have been recalled by an Australian brewer after complaints indicated the bottles could contain broken glass. The beer, Carlton Dry, is produced by Carlton & United Breweries, a subsidiary of beer giant SABMiller. The brewer sells about 240 million bottles of Carlton Dry per year.

పది లక్షల బీర్లు వెనక్కి.. ఎందుకంటే

Posted: 12/05/2015 01:23 PM IST
Australian brewer recalls ten lakh beers

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షల బీర్లు వెనక్కి తీసుకుంది ఓ బీర్ల కంపనీ.. ఆ కంపెనీ బీర్లలో చిన్న చిన్న గాజు పెంకలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో వాటిని వెనక్కి రప్పించింది. అయితే ఇది మన దగ్గర కాదు లెండి. ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన. బీరు బాటిళ్లలో చిన్న చిన్న గాజు పెంకులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో సాబ్‌మిల్లర్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. శాబ్‌మిల్లర్ కంపెనీ ఆస్ట్రేలియాలో కార్లటన్ బీర్లను ఉత్పత్తి చేస్తోంది. 335 మిల్లీలీటర్ల సామర్థ్యం ఉన్న బీరు బాటిళ్లలో చిన్న గాజు పెంకులు వస్తున్నట్లు ఇప్పటివరకు సుమారు డజనకుపైగా ఫిర్యాదు వచ్చాయి. క్వీన్స్‌లాండ్ బాట్లింగ్ ప్లాంట్ నుంచి వెళ్లిన బీరు బాటిళ్లలో ఆ ఫిర్యాదు వస్తున్నట్లు కంపెనీ అధికారులు గుర్తించారు.

గత అక్టోబర్‌లో ఆ బాటిళ్లను సరఫరా చేశారు. బాట్లింగ్ సమయంలోనే లోపం తలెత్తి ఉంటుందని కంపెనీ అధికారులు భావిస్తున్నారు. అయితే లక్షల కొద్ది బీర్ల బాటిళ్లు వెనక్కి రప్పించడం వల్ల ఆ కంపెనీకి పెద్దగా నష్టం ఏమీ జరగదని విశ్లేషకులు అంటున్నారు. శాబ్‌మిల్లర్ కంపెనీ ప్రతి ఏడాది 240 మిలియన్ల బాటిళ్లను సరఫరా చేస్తుంది. ప్రస్తుత రికాల్ చేస్తున్న బాటిళ్ల వల్ల ఒక్క శాతం కంటే తక్కువే నష్టం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఓ బీర్ల కంపెనీ ఇలా పది లక్షల బీర్ బాటిళ్లను వెనక్కి రప్పించడం మాత్రం వార్తల్లో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beer  Australia  SABMiller  Carlton Dry  Beers recall  

Other Articles