ndtv-media-group-in-online-wedding-market

India s ndtv enters online wedding space raises funding from us

CerraCap Ventures, NDTV, Online wedding market, NDTV into online wedding market, Special Occasion, NDTV new venture,

Media group NDTVBSE 4.82 % today announced its foray into online wedding market space with its new venture Special Occasion Ltd, which has raised an undisclosed sum from US-based CerraCap Ventures.

ఆన్ లైన్ వెడ్డింగ్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఎన్డీటీవీ

Posted: 12/05/2015 11:07 AM IST
India s ndtv enters online wedding space raises funding from us

జాతీయ మీడియాలో తనకంటూ ప్రముఖ స్థానాన్ని ఏర్పర్చుకున్న ఎన్‌డీటీవీ మీడియా గ్రూప్.. తాజాగా ఆన్‌లైన్ వెడ్డింగ్ మార్కెట్ స్పేస్‌లోకి ప్రవేశించింది. స్పెషల్ అకేషన్ పేరుతో ఆన్‌లైన్ ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త వెంచర్‌కు అమెరికాకు చెందిన సెర్రాక్యాప్ వెంచర్స్ నుంచి పెట్టుబడుల సమీకరించామని ఎన్‌డీటీవీ తెలిపింది. అయితే ఎంతమొత్తంలో నిధులు సమీకరించిందీ కంపెనీ వెల్లడించలేదు. సెర్రాక్యాప్ వెంచర్స్ నుంచి సమీకరించిన పెట్టుబడులు ఆధారంగా స్పెషల్ అకేషన్ విలువను 2 కోట్ల డాలర్లుగా పేర్కొంది.

ఈ స్పె షల్ అకేషన్ వెంచర్‌కు సీఈఓగా సచిన్ సింఘాల్‌ను నియమించామని వివరించింది. తాము అందుబాటులోకి తెచ్చిన ఇండియన్‌రూట్స్‌డాట్‌కామ్, గాడ్జెట్360డాట్‌కామ్, కార్‌ఎన్‌బైక్‌డాట్‌కామ్.. వంటి ఈ కామర్స్ వెంచర్లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఎన్‌డీటీవీ సీఈఓ విక్రమ్ చంద్ర చెప్పారు. ఆన్‌లైన్ వెడ్డింగ్ మార్కెట్ 4,000 కోట్ల డాలర్ల మార్కెట్ అనీ, అయితే అత్యధిక భాగం అవ్యవస్థీకృతంగా ఉందని సెర్రాక్యాప్ వెంచర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ సౌరభ్ సూరి చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NDTV  Online wedding market  cerracap ventures  

Other Articles