Kishan Reddy should be replaced: BJP MLA Raja Singh

Storm in bjp t cup raja singh slams kishan reddy

bjp, telangana state, bjp president, kishan reddy, goshamahal mla, rajasingh, bjp mla, amith shah, pm, modi, central government scheme, Raja singh, goshamahal mla, G kishan reddy, telangana bjp state president

Goshamahal MLA Raja Singh came down strongly against Telangana state party president Kishan Reddy and said the party can grow only when he is removed.

కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా తొలగించాలని అమిత్ షాకు రాజా సింగ్ లేఖ

Posted: 12/01/2015 06:01 PM IST
Storm in bjp t cup raja singh slams kishan reddy

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డిపై అదే పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కిషన్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తొలగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్ షాకు లేఖ రాసినట్లు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలంటే అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో మరోకరిని నియమించాలని ఆ లేఖలో అమిత్ షాను కోరినట్లు రాజాసింగ్ వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిర్వహించ తలపెట్టిన బీఫ్ పెస్టివల్ ను అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కాగా బీఫ్ పెస్టివల్ నిర్వహణ పట్ల తమకెలాంటి అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి ప్రకటించడం వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలను ఆజ్యం పోసిందని వార్తలు వినబడుతున్నాయి.

అయితే గోషామహాల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోదరుడు మధు గౌడ్ ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. అయన చేరికపై రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. దానిని కిషన్ రెడ్డి లక్ష్యపెట్టకుండా అతన్ని పార్టీలోకి ఆహ్వానించారు. కాగా త్వరలోనే ముఖేష్ గౌడ్ కూడా బీజేపి కండువా కప్పుకునేందుకు రెడీ అవుతన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ముఖేష్ గౌడ్ మళ్లీ తనకు పార్టీలో ప్రత్యర్థిగా మారుతున్న కోణంలోనే ఈ చేరికను అడ్డుకునేందుకు కిషన్ రెడ్డినే రాజాసింగ్ టార్గెట్ చేస్తూన్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raja singh  goshamahal mla  G kishan reddy  telangana bjp state president  

Other Articles