For Mahatma Gandhi, Swachh Bharat meant a clean mind and environment: President Pranab Mukherjee

Real dirt of india lies in the minds not streets pranab mukherjee

Swachh Bharat, Pranab Mukherjee, Mahatma Gandhi, higher education, environment, real, dirt, of, india, lies, in, our, minds',, says, president, pranab, mukherjee, india, clean mind, clean environment, peace and harmony, reorient disruptive forces

Invoking Mahatma Gandhi, President Pranab Mukherjee today said Swachh Bharat implies a clean mind along with a clean environment and asserted that educating in peace and harmony is the key to contain and reorient disruptive forces in society.

అపరిశుభ్రత మన వీధుల్లో కాదు.. మనస్సుల్లో వుంది-రాష్ట్రపతి

Posted: 12/01/2015 06:00 PM IST
Real dirt of india lies in the minds not streets pranab mukherjee

జాతిపిత మహాత్మా గాందీ ఉద్దేశంలో స్వచ్ఛ భారత్ అంటే కేవలం పరిశుభ్రమైన భారత్ సమాజం మాత్రమే కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. స్వచ్చ భారత్ అంటే గాంధీజీ నిర్వచనంలో స్వచ్ఛమైన మనసు, నిర్మలమైన వాతావరణంతో పాటు పరిశుభ్రమైన సమాజమని ఆయన చెప్పారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సబర్మతీ ఆశ్రమంలో జరిగిన 62వ గుజరాత్ విద్యాపీట్ స్నాతకోత్సవంలో ప్రణబ్ పాల్గొన్నారు.

ప్రజల్లో అసహనం గురించి మాట్లాడుతూ, దేశంలో నిజమైన చెత్త రోడ్లపై లేదని... ప్రజల మనసుల్లో ఉందని అన్నారు. సమాజాన్ని విభజించే భావజాలాన్ని మన మనసుల్లోంచి తీసివేసేందుకు మనం ఇష్టపడటం లేదని అదే ఇందుకు నిదర్శనమన్నారు. దేశం సంఘటితంగా ఉండాలని గాంధీ కలలు కన్నారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలంతా సమానమేనని, అనందంగా ఉండాలని, మనుషులపై ఒకరికొకరికి నమ్మకం ఉండాలని కోరారు. భారత్ అహింస అనే సూత్రం ఆధారంగా ఏర్పడిందన్న ప్రణబ్, ఈ వైవిధ్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swachh Bharat  Pranab Mukherjee  Mahatma Gandhi  

Other Articles