airasia big sale now book domestic flight at rs 990, international flights at Rs 3699

Airasia offers tickets priced at rs 990 in airline s big sale

airasia, airasia offer, airasia sale, airasia big sale, airasia flights, airasia ticket price, airasia x, airasia x offers, AirAsia, Airasia X, Huge discounts, Big Sale, Air ticket

The 'Big Sale' by AirAsia and AirAsia X is back, with all-inclusive ticket prices starting from Rs 990 to Pune, Goa, Kochi, Guwahati, Vizag and many more domestic destinations connected by AirAsia India and Rs 3,699 to International destinations...

ఎయిరేషియా బిగ్ సేల్.. దేశీయ విమానయానం 990

Posted: 11/25/2015 10:54 AM IST
Airasia offers tickets priced at rs 990 in airline s big sale

విమానయానం చేయాలన్న కలలను సొంత చేసుకోవాలనుకునే వారికి చక్కని అవకాశం. ఎయిర్ ఏషియా బిగ్ సేల్ లో భాగంగా కస్టమర్లకు అత్యంత తక్కువ ధరల్లో టిక్కెట్లను విక్రయిస్తుంది.  టికెట్లకు సంబంధించి ఎయిర్‌ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్... భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. పుణే, గోవా, కోచి, గౌహతి, వైజాగ్ వంటి దేశీయ రూట్లలో విమాన టికెట్‌లు  రూ.990 (అన్ని చార్జీలు కలుపుకొని) నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్  సీగ్‌ట్రాండ్ టెక్ పేర్కొన్నారు.  

అలాగే బ్యాంకాక్, కౌలాలంపూర్, వంటి అంతర్జాతీయ నగరాలకు తమ గ్రూప్ విమానాల ద్వారా జరిపే విమాన ప్రయాణాలకు చార్జీలను రూ.3,699కు ఆఫర్ చేస్తున్నామని వివరించారు. ఈ నెల 29 వరకూ ఎయిర్‌ఏషియాడాటకామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ కాలం వచ్చే ఏడాది మే 1 నుంచి 2017 ఫిబ్రవరి 5 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్‌కు డెరైక్ట్ విమాన సర్వీస్‌ను ఎయిర్ ఏషియా ఎక్స్ నుంచి అందిస్తున్నామని వివరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  Airasia X  Huge discounts  Big Sale  Air ticket  

Other Articles