బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల దుమారం దేశాన్ని కుదిపేస్తోంది. అమీర్ ఖాన్ దేశంలో పెరుగుతున్న అసహనం ఎంతో భయాందోళన కలిగిస్తోందని వివరించారు. దేశం వదిలి వెళ్దామని తన భార్య చెప్పినట్లు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల మీద సర్వత్రా నిరసన సెగలు వెల్లువెత్తాయి. కాగా అమీర్ దెబ్బకు ఓ కంపెనీ మాత్రం దారుణ పరిస్థితిని ఎదుర్కంటోంది. తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ ను పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. చాలా మంది ఆ కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏంటా కంపెనీ అనుకుంటున్నారా...? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ స్నాప్ డీల్. అవును చాలా మంది స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసేస్తున్నారు. దాంతో స్నాప్ డీల్ కు గట్టి దెబ్బ తగిలింది.
అమీర్ ఖాన్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. స్నాప్ డీల్ కంపెనీని ప్రచారం చేస్తున్న అమీర్ చేస్తున్న చేసిన వ్యాఖ్యాలకు వ్యతిరేకంగా ఆ యాప్ ను తీసివేస్తున్నారు. స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చెయ్యడమే కాకుండా స్నాప్ డీల్ కు అమీర్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ కంపనీకి సింగిల్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. దాంతో కంపెనీ ఉనికి మీద అనుమానాలు తలెత్తుతున్నాయి. అమీర్ దెబ్బకు స్నాప్ డీల్ కుదేలైవుతోంది.
Read Also: అమీర్ ఖాన్ పై కేసు నమోదు.. దేశవ్యాప్తంగా నిరసన సెగలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more