Complaint lodged against Aamir Khan for his intolerance remark

Complaint lodged against aamir khan for his intolerance remark

Amir Khan, Anupam Kher, intolarence, India, Modi, Intolarence in India, Anupam Kher on Amir Khan, Asaduddin Owisi, Raveena Tandan, Shanawaz hussain, Yogi Aditya

A day after Bollywood actor Aamir Khan stated that there was perceived intolerance in the country, a complaint has been lodged against him at the New Ashok Nagar police station. The complaint has been filed by short film and documentary maker Ullhas PR. Ullhas PR had lodged a complaint against Aamir following the release of his movie PK for referring to policemen as 'thulla'.

అమీర్ ఖాన్ పై కేసు నమోదు.. దేశవ్యాప్తంగా నిరసన సెగలు

Posted: 11/25/2015 09:34 AM IST
Complaint lodged against aamir khan for his intolerance remark

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మీద దేశవ్యాప్తంగా నిరసన సెగలు మిన్నంటాయి. అమీర్ ఖాన్ దేశంలో పెరుగుతున్న అసహనం మీద చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారాన్ని రేపుతున్నాయి. దేశం వదిలి వెళ్లాలని తన భార్య చెప్పినట్లు అమీర్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ పార్టీలతో పాటు, సినీ స్టార్స్ కూడా వ్యతిరేకించారు. కాగా అమీర్ ఖాన్ మీద ఢిల్లీలోని అశోక్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అమీర్ ఖాన్ ఇంటి ఎదుట భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు ప్రారంభించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పలువురు అమీర్ ఖాన్ వ్యాఖ్యల మీద స్పందించారు.. వారి స్పందన చూడండి...

రవీనా టండన్:
నరేంద్ర మోదీని ప్రధానిగా చూడలేని వ్యక్తులు, ఇప్పుడు ప్రభుత్వాన్ని దించేయాలనుకుంటున్నారని నటి రవీనాటాండన్ పేర్కొన్నారు. రవీనా టాండన్ ట్వీట్ల సారాంశం ఇలా ఉంది.. ''మోదీని ప్రధానిగా చూడకూడదని అనుకునేవాళ్లంతా ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. వాళ్లు దేశానికి సిగ్గుచేటు. అసహనాన్ని ఖండించాలని, దానిపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పొచ్చు. కానీ, ఇలా విషం చిమ్మడం సరికాదు. దేశానికి గుండెకాయ లాంటి ముంబై మహానగరం మీద బాంబుల వర్షం కురిసినప్పుడు వాళ్లకు ఎందుకు భయం వేయలేదో అని ఆశ్చర్యం వేస్తోంది. మోదీ ప్రధాని అయిన రోజు నుంచి తాము సంతోషంగా లేమని వీళ్లు బహిరంగంగా చెబితే బాగుండేది. అంతేతప్ప మొత్తం దేశం సిగ్గుపడేలా వ్యాఖ్యానించడం సరికాదు. వాళ్లకు నిజంగా దమ్ముంటే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి. అంతేతప్ప దేశ పరువు ప్రతిష్ఠలను దిగజార్చకూడదు. ఏ రకమైన నిరసనతోనూ నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ మన దేశాన్ని గౌరవించే విషయానికొద్దాం.. దేశం నీకు ఏమిచ్చిందో, నువ్వు దేశానికి ఏమిచ్చావో ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో.''

అసదుద్దీన్ ఒవైసీ:
భారతీయ ముస్లింలు దేశం విడిచి ఎక్కడికీ వెళ్లరని, దేశ పౌరులుగా ఇక్కడే ఉండి అభివృద్ధికి పాటుపడతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యలపై తానేమీ స్పందించబోనని, సంఘ్ పరివార్ నియంతృత్వ పోకడలను అడ్డుకుంటూ హక్కుల కోసం ముస్లింల పోరాటం ప్రజాస్వామ్యయుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఆమిర్‌ఖాన్ వాస్తవాన్ని చెప్పేందుకు భయపడాల్సిన అవసరంలేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

యోగి ఆదిత్యనాథ్:
ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, హిందుత్వ నాయకుడు యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఆమిర్ దేశాన్ని వదిలి వెళ్తానంటే ఎవరూ ఆపరని, పైగా దేశంలో జనాభా అయినా తగ్గుతుందని అన్నారు. వెళ్లాలనుకుంటున్నవారు స్వచ్ఛందంగా వెళ్లవచ్చు. వారిని ఎవరూ ఆపరు. భారత్‌లో అసహన పరిస్థితులు ఉన్నాయంటున్నవారు సహనం ఏ దేశంలో ఉందో చెప్పాలి. లేదంటే ఐఎస్‌ఎస్ ఉగ్రవాద సంస్థ ఏమైనా సహనాన్ని పాటిస్తుందేమో తెలపాలి అని ఆదిత్యనాథ్ అన్నారు. మరోవైపు అసహనం పేరుతో ఆమిర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు కలిగించేవిగా, అభద్రతా భావాన్ని పెంచేవిగా ఉన్నాయని పేర్కొంటూ ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది.

షానవాజ్ హుస్సేన్:
ఆమిర్‌ఖాన్, ఆయన కుటుంబం భారత్‌ను వదిలి ఎక్కడికి వెళతారని ఆ పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ప్రశ్నించారు. భారత్ వంటి సహనం కలిగిన లౌకిక దేశం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఓ భారతీయ ముస్లింకు హిందువుల కన్నా మంచి పొరుగువారు ఏ దేశంలోనూ ఉండరని ఆయన అన్నారు. కళాకారులకు కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతిభతో మాత్రమే ఆదరణ లభిస్తుందని అన్నారు. భారత్‌లో ఆమిర్ క్షేమంగానే ఉన్నారని, ఆయనను దేశం విడిచి వెళ్లనివ్వబోమని అన్నారు. ఆమిర్ వ్యాఖ్యలు ఆయన అభిమానులను బాధించాయని ఆయన పేర్కొన్నారు. కాగా, దేశానికి, మోదీ నాయకత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles