Girl who was gang-raped, filmed fights back

This teenage girl is a rapist s nightmare

International Women's Conference, Bitiya, Gang rape, Fifteen-year-old Bitiya, unspeakable trauma, raped by four upper caste men, filmed the heinous crime for sale, Uttar Pradesh

15 year-old Bitiya endured unspeakable trauma when she was raped by four upper caste men who filmed the heinous crime for sale in the market. But she stood up to her rapists and is now fighting a case against them in Uttar Pradesh.

ఆ మగమృగాళ్ల పాలిట సింహస్వప్నం.. ఈ విధి వంచిత

Posted: 11/22/2015 01:03 PM IST
This teenage girl is a rapist s nightmare

నలుగురు అగ్రవర్ణాలకు చెందిన దుర్మార్గుల అకృత్యానికి బలైన ఓ పదిహేనేళ్ల బాలిక వారిపై నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన బితియా (పేరు మార్చాం) అనే దళిత బాలికను కిడ్నాప్ చేసి.. నిర్ఝన ప్రదేశానికి తీసుకువెళ్లిన పైశాచిక మృగాలు.. అమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాయి. అంతేకాదు తనపై అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనను దుర్మార్గులు వీడియో తీసి స్థానిక మార్కెట్లో అమ్ముకున్నారు.

2012లో ఈ ఘటన జరిగిన తర్వాత తనను అందరూ దోషిలా చూడటం మొదలుపెట్టారని, స్కూల్‌కు రానివ్వలేదని చెప్పింది.. తానే ఏదో నేరం చేసినట్లుగా అందరి చూపులు తనను ప్రశ్నించాయని తెలిపింది. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన  దుర్మార్గులపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకొమ్మని గ్రామస్తులు, ఊరి పెద్దలు ఒత్తిడి తెచ్చారని చెప్పింది. కామమృగాలు  చేసిన పాపానికి పరిహారంగా తనకు. డబ్బు ఇస్తామని కూడా ప్రలోభ పెట్టారనింది. న్యాయవాదులు కూడా సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారని తన అవేదనను తెలిపింది. కానీ తాను మాత్రం కేసును వెనక్కి తీసుకోలేదని. ఓ ఎన్‌జీఓ సహకారంతో పోరాడుతున్నా’’ అని ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సులో బితియా వివరించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : International Women's Conference  Bitiya  Gang rape  

Other Articles