jubilee hills police raid pub in hyderabad

Pub owner arrested in jubilee hills

pub, jubilee hills police, stone water kitchen lounge pub, pub owner dheeraj arrested, dheeraj arrested by jubilee hills police, dheeraj arrested

stone water kicthen lounge pub owner dheeraj arrested by jubilee hills police for keeping it open even in late night

జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో ధీరజ్

Posted: 11/22/2015 12:36 PM IST
Pub owner arrested in jubilee hills

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను తుంగలో తొక్కి, నియమ నిబంధనలకు నీళ్లు వదిలో ఓ పబ్ యజమానిని పోలీసులు కటకటాల్లోకి నెగ్గారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు పబ్ లు కూడా రాత్రి పదిన్నర సమయానికి మూసి వేయాలి. అయితే కాలాతీతం అయినా.. నిబంధనలకు విరుద్దంగా తమ పబ్ లో మద్యం తాగే వారిని ప్రోత్సహిస్తున్న పబ్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

రాత్రి సమయంలో కూడా పబ్ లో మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అర్థరాత్రి తమ పరిధిలోని ఓ పబ్ పై దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లోని స్టోన్ వాటర్ కిచెన్ లాంజ్ పబ్పై పోలీసులు దాడి చేసి... యజమాని ధీరజ్ను అరెస్ట్ చేశారు. ఆర్థరాత్రి దాటిన తర్వాత పబ్ తెరచి ఉంచడంతో అదే సెక్షన్ల కింద అతనిపై కేసు నమోందు చేశారు. కాగా పోలీసుల దాడితో పబ్లోని యువతి యువకులు అక్కడి నుంచి జారుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pub  jubilee hills police  stone water kitchen lounge pub  

Other Articles