Not easy to Get Dawood Back; He is Under Enemy's Protection'

Not easy to get dawood back he s under protection

chhota rajan, dawood ibrahim, Neeraj kumar, Neeraj Kumar Dawood, Neerak Kumar book, Neeraj Kumar Dial D for Don,Dawood Ibrahim Neeraj Kumar

Former Delhi police commissioner Neeraj Kumar said that it was not easy to bring back fugitive underworld don Dawood, because he was receiving patronage of the "enemy country".

ఆయనను పట్టుకోవడం అంత ఈజీ కాదట..

Posted: 11/22/2015 01:40 PM IST
Not easy to get dawood back he s under protection

అండర్‌ వరల్డ్‌ డాన్ దావూద్‌ ఇబ్రహీంను పట్టుకోవడం అంత సులభం కాదని ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇటీవల అరెస్టైన దావూద్ బద్ధ విరోధి, గ్యాంగ్‌స్టర్‌ ఛోటారాజన్‌ కూడా చేసే సాయమేమీ లేదని ఆయన చెప్పారు. అందుకు నీరజ్ కుమార్ తన వివరణను కూడా ఇచ్చారు. దావూద్ భారత్ శత్రుదేశం పాకిస్తాన్ లో తలదాచుకోవడమే ఇందుకు కారణమని చెప్పుకోచ్చారు. దావూద్‌ పట్టుకోగలమని మేం చెప్పలేం. ఎందుకంటే పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కనుసన్నలో అతను ఉండటం. అతన్ని పట్టితేవాలన్న రాజకీయ చిత్తశుద్ధి మన దేశానికి లేకపోవడం రెండూ కారణమేనన్నారు .

శత్రుదేశం రక్షణలో ఉండటం వల్లే అతను ఇంకా మనకు పట్టుబడకుండా ఉండగలుగుతున్నాడని. పరారీలో ఉన్న అతన్ని పట్టుకోవడం అంత సులభం కాదని చెప్పారు.  'డయల్ ఫర్ డాన్‌' పేరిట రాసిన పుస్తకాన్ని ముంబైలో విడుదల చేసిన నీరజ్ కుమార్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తే దావూద్‌ను భారత్‌కు తీసుకొచ్చి శిక్షించే అవకాశముంటుందని చెప్పారు. 1990లలో దావూద్ లొంగిపోవడానికి ముందుకొచ్చాడని నీరజ్‌కుమార్ తన పుస్తకంలో వెల్లడించడం.. ఇటీవల మీడియా పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. దావూద్‌తో తాను మూడుస్లారు ఫోన్లో సంభాషించానని, చివరిసారిగా తాను రిటైర్మెంట్‌కు ముందు 2013లో అతని నాకు ఫోన్‌ చేశాడని ఆయన వివరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chhota rajan  dawood ibrahim  Neeraj kumar  

Other Articles