Mohan Reddy has a 'clone' in the police department

Karimnagar additional sp shunted out

Telangana, ASI Mohan Reddy, ASP janardhan reddy, DGP office, Hyderabad, transferred, crime, law and justice, exploiting, fleece people, Karimnagar district,

Every police officer involved in Mohan Reddy’s finance deals would be transferred, sources in DGP Office said

వడ్డీల అసురుడికి పెట్టుబడులిచ్చిన పెద్దలపై వేటు..!

Posted: 11/13/2015 01:59 PM IST
Karimnagar additional sp shunted out

కరీంనగర్ జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డిని బదిలీ వేటు పడింది. ఈ మేరకు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు జారీ అయ్యాయి. వెనువెంటనే కరీంనగర్ ఏఎస్పీ బాధ్యతలను వదిలి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయనను ఉన్నతాధికారులు ఆదేశించారు. వడ్డీల వ్యాపారం చేసి.. ప్రజలను హింసించి.. వారిపై ఎలాంటి దయ, కరుణ, కనికరం లేకుండా ఆస్తులను రాయించుకున్న వడ్డీల అసురుడు, కరీంనగర్ ఏఎస్ఐ మోహన్ రెడ్డి సస్సెన్షన్ అనంతరం తనకు వడ్డీ వ్యాపారం చేసేందుకు పెట్టుబడులుగా డబ్బులిచ్చిన వారి పేర్లను అయన తన వాంగ్మూలంలో చెప్పడంతో వారిపై చర్యలు ప్రారంభమయ్యాయి.

ఆ జాబితాలో తొలి వేటు ఏఎస్పీ జనార్దర్ రెడ్డిపై పడింది. అయనను తక్షణం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్న అదేశాలు వెలువడటంతో చర్యలు ప్రారంభమయ్యాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఏఎస్సై మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారం నడుపుతుంటే, ఆ వ్యాపారానికి జనార్దన్ రెడ్డి పెట్టుబడి పెడుతున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు వేశారని తెలుస్తోంది. కాగా ఈ కేసులో మోహన్ రెడ్డికీ పెట్టుబడుల కోసం డబ్బులిచ్చిన అందరూ పోలీసులపై చర్యలను తీసుకుంటామని డీజీపీ కార్యాలయవర్గాల సమాచారం.

మోహన్ రెడ్డి వేధింపులు తాళలేక కరీంనగర్ లోని కెన్ క్రెస్ట్ స్కూల్ డైరెక్టర్ ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను చేపట్టిన తెలంగాణ సీఐడీ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా, మోహన్ రెడ్డి వడ్డీ వ్యాపారంలో జనార్దన్ రెడ్డి పెట్టుబడులు వెలుగుచూశాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జనార్దన్ రెడ్డిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో డీజీపీ కార్యాలయం ఆయనపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక మోహన్ రెడ్డీకి డబ్బులిచ్చిన పోలీసు పెద్దల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మోహన్ రెడ్డి భాగస్వాములు

* జనార్ధన్ రెడ్డి, అడిషనల్ ఎస్పి (అడ్మిన్), కరీంనగర్, (90 లక్షలు)
* రంగరాజు భాస్కర్ రావు ప్రస్తుతం హైదరాబాద్లో విధులు (రూ 10 లక్షలు)
* బుచ్చిరాములు ఎస్ఐబి ఇంటెలిజెన్స్ కరీంనగర్ (రూ .20 లక్షలు)
*సాయి మనోహర్ డిఎస్పి గతంలో కరీంనగర్ లో CI గా విధులు (రూ 35 లక్షలు)
* R ప్రకాష్, సిఐ, సిఐడీ కరీంనగర్  (రూ .20 లక్షలు)
* శంకర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ 1 టౌన్ కరీంనగర్ టౌన్ (రూ .10 లక్షలు)
* సిహెచ్ మల్లయ్య, ఇన్స్పెక్టర్ విజిలెన్స్, విద్యుత్, కరీంనగర్ (రూ .20 లక్షలు)

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  ASI Mohan Reddy  ASP janardhan reddy  Hyderabad  crime  law and justice  

Other Articles