Lions try to make a meal of visiting tourists

Tourists cheat death in tanzania lion attack

safari, meal, lions, news, nature, uk, car, pictures, Safari, Vehicle, Wheel, Lion, Tire, Tourism, South Africa, Automobile, Ride, Lions Meals from wheels, Lion, Serengeti National Park, Jeep tire

THESE lions appeared to think this terrified group of tourists were the “mane” course as they attacked their car on safari.

మృగరాజులు వర్సెస్ పర్యాటకులు.. బీతావాహ అనుభవం..

Posted: 11/13/2015 10:35 AM IST
Tourists cheat death in tanzania lion attack

అడవులకు రారాజులుగా వున్న మృగరాజులు.. పర్యాటకులతో అటాడుకున్నాయి. జాలీగా హాలిడే గడిపేద్దామనుకున్న పర్యాటకులకు బీతావాహ అనుభవాలు ఎదురయ్యాయి. మరో విధంగా చెప్పాలంటే.. మృగరాజులను చూసి వద్దామనుకున్న పర్యాటకులకు మరణం అంచు వరకు తీసుకెళ్లాయి అక్కడి సింహాలు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ బయటపడాల్సిన పరిస్థితి వారికి ఎదురైంది.. టాంజానియాలోని సెరెంగెటి జాతీయ పార్కులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

టాంజానియా సెరెంగేటి పార్కులో జంతువులను చూద్దామని జీపులో బయల్దేరిన పర్యాటకులు బయలుదేరారు. అదే సమయంలో అటుగా వచ్చిన రెండు మృగరాజులు వారి జీపును చుట్టుముట్టాయి. ఆకలితో నకనకలాడుతున్నాయో ఏమో కానీ.. పర్యాటకులు జీపు టైర్లను కొరికిపడేసి తమ అకలి తీర్చుకుందామనుకున్నాయి. జీపులోని పర్యాటకులను చూసి వారిపై కూడా దాడి చేసేందుకు అద్దాలను పగులగొట్టేందుకు యత్నించాయి. అయితే అది సాధ్యపడకపోవడంతో.. దాదాపుగా గంట తరువాత అవి వెనుదిరిగాయి. అవి వెళ్లాయని నిర్థారించుకున్న తరువాత జీపులో వున్న పర్యాటకులు ప్రాణభయ తప్పిందని నిట్టూర్చారు.  ఈ సన్నివేశాన్నిఆ పార్కు పర్యాటకుల గైడ్ ఎమ్మానుయేల్ బయో తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో విషయం బయటకు తెలిసింది


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lion  Serengeti National Park  Jeep tire  

Other Articles