Man proposes to his girlfriend with wisdom tooth engagement ring

Woman receives wisdom tooth engagement ring

wisdom tooth, engagement ring, girlfriend, California groom engagement ring, wisdom tooth ring, Carlee Leifkes, Lucas Unger, Halloween,

Forget the diamonds, a groom-to-be in California decided to put some real teeth into his marriage proposal.

డైమండ్ రింగ్ కాదది కానీ.. తన ప్రియురాలి మదిని దోచింది

Posted: 11/06/2015 10:18 PM IST
Woman receives wisdom tooth engagement ring

చైనాలో ఓ ప్రియుడు తన ప్రేయసికి 4550 డైపర్లలను హృదయాకారంలో అమర్చి తన ప్రేమను తెలుపి.. ప్రేయసి మనస్సును దోచుకోగా, కాలిఫోర్నియాలో ఓ ప్రియుడు తన జ్ఞానదంతాన్ని రింగ్ గా అమర్చి తన ప్రేమను ప్రపోజ్ చేసి ఆమెను ఆశ్చర్యపరిచాడు. పంటితోనా! ఎలాగెలాగా అంటారా..  ఉంగరంలో ఏ రత్నమో, పగడమో, వజ్రమో ఉంగాల్సిన చోట తన జ్ఞానదంతాన్ని పొదిగాడు దాంతో రింగ్ ను తయారు చేయించాడు అంతే తన ప్రేయసి మనస్సును గెలుచుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే కాలిఫోర్నియాకు చెందిన లూకాస్ ఉంగర్ అనే ఆ యువకుడికి కార్లీ లిఫ్కెస్ అనే చిన్నదాని ప్రేమలో పడ్డాడు. ఈ ఏడాది ప్రారంభంలో కెనడాలోని ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా చిగురించి.. ఆపై ప్రేమగా విరబూసింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు చెప్పారు. పెద్దల అంగీకారం పై వీరిద్దరూ ఎన్ గేంజ్ మెంట్ చేసుకోదలిచారు.

అదే రోజు కార్లీ కుటుంబ సభ్యులందరు చూస్తుండగా ఆమె ఎదురుగా మోకాలిపై కూర్చొని 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అంటూ జ్ఞానదంతం అమర్చిన రింగ్ తొడిగి లూకాస్ ప్రపోజ్ చేశాడు. నవ్వుతూ ఒప్పేసుకుంది క్లారీ. నా ఆప్త మిత్రుడిని వివాహం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని కార్లీ ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది. అతని జ్ఞానదంతంతో చేసి ఇచ్చిన ఉంగరం డైమండ్ రింగ్ కన్నా విలువైందని చెబుతోంది. వీరిద్దరూ నవంబర్ 21న లాస్వెగాస్లో పెళ్లి చేసుకొనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wisdom tooth  engagement ring  girlfriend  

Other Articles