Government to impose 0.5% Swachh Bharat cess on services from November 15

Government to impose 0 5 swachh bharat cess on services from november 15

Swachh Bharat, India, Modi, Swachh Bharat Tax, Swachh Bharat in India, Swachh Bharat from oct 2

Soon after the Diwali festivities, you will have to shell out a bit more for all the services so that the country can become cleaner. The government has decided to levy the Swachh Bharat Cess proposed in the budget on all services that are at present taxed from November 15. The cess will be levied at the rate of 0.5%, the finance ministry said in a statement, adding that it will have only marginal impact on consumer prices.

ఇక స్వచ్ఛ భారత్ టాక్స్ కూడా

Posted: 11/07/2015 07:50 AM IST
Government to impose 0 5 swachh bharat cess on services from november 15

దేశంలో పన్ను వ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని.. ఇప్పటికే మార్పులు కూడా తీసుకువచ్చింది ఎన్డీయే సర్కార్. అయితే పన్ను పోటును తగ్గిస్తామని చెప్పినా కానీ అమలు మాత్రం చెయ్యడం కుదరదు అని అర్థమవుతోంది. తాజాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పేరు జనంపై పన్ను భారం వేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి నిధుల సేకరణే లక్ష్యంగా తాజాగా దేశంలోని అన్ని సేవలపైనా 0.5 శాతం ‘స్వచ్ఛభారత్’ పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి ఈ కొత్త పన్ను అమలు చేయాలని డిసైడైంది. ఈ కొత్త పన్ను అమల్లోకి వస్తే ప్రతీ రూ.100 విలువైన ప్రతి సేవపైనా 50 పైసలు సెస్ రూపంలో వసూలు చేస్తారు. విమాన ప్రయాణాలు, టెలిఫోన్ సేవలు, హోటల్ భోజనాలు, బ్యాంకింగ్ ఇలా ప్రతీ సేవ పైనా ‘స్వచ్ఛ భారత్’ పన్ను విధిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తగా వసూలు చేస్తున్న 14 శాతం సేవా పన్నుకు ఇది అదనం.

స్వచ్ఛ భారత్ పన్ను ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా రూ.4,000 కోట్లు కేంద్రం సమీకరించనుంది. ఈ మొత్తాన్ని కేవలం స్వచ్ఛభారత్ కార్యక్రమం కోసం ఖర్చు చేయనున్నారు. ఫిబ్రవరి 28న 2015-16 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ అవసరమైతే 2 శాతం స్వచ్ఛభారత్ సెస్ వసూలు చేస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. స్వచ్ఛభారత్ అభియాన్ నీతి ఆయోగ్ ఉప కమిటీ కన్వీనర్-గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నివేదికను ప్రధాని మోదీకి అందచేసిన విషయం విదితమే. ఆ నివేదికలో 2019 నాటికి దేశాన్ని స్వచ్ఛభారత్-గా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన అంశాలను సిఫార్సుల రూపంలో కేంద్రానికి నివేదించారు. స్వచ్ఛభారత్-కు నిధుల సమీకరణ విషయంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు, చమురు సంస్థలు, ఇతరత్రాల నుంచి సెస్-ల రూపంలో వసూలు చేయడానికి సిఫార్సులు చేసినట్టు చంద్రబాబు చెప్పడం గమనార్హం. కానీ శుక్రవారం కేంద్రం అన్ని సేవలపైనా సెస్ రూపంలో ప్రజలపై భారం వేస్తూ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swachh Bharat  India  Modi  Swachh Bharat Tax  Swachh Bharat in India  Swachh Bharat from oct 2  

Other Articles