maldives police raid tv station as alleged video threatens to kill president yameen

Maldives raid private tv station after declaring emergency

Maldives President, Abdulla Yameen, Islamic State Video, maldives emergency, emergency maldives, maldives president, maldives president emergency, world news

A private television station was raided on Friday by Maldivian police in connection with an alleged IS video posted on YouTube that threatened to kill President Abdulla Yameen

దేశాధ్యక్షుడిని హతమారుస్తామంటూ ఐఎస్ హెచ్చరికలు.. ఎమర్జెన్సీ..

Posted: 11/06/2015 10:16 PM IST
Maldives raid private tv station after declaring emergency

మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ను 30 రోజుల్లో హత్య చేస్తామని ఓ వీడియో యూట్యూబ్లో హల్ చల్ చేసింది. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు వెంటనే స్పందించి దానిని పోస్ట్ చేసిన 'సాంగు టీవీ' అనే ఓ ప్రైవేట్ టీవీ చానెల్పై రైడింగ్ నిర్వహించాయి. ఆ చానెల్లోని ఉద్యోగుల్లో ఎవరో ఒకరు దానిని పోస్ట్ చేసి ఉంటారని, ఉగ్రవాద కార్యకలాపాలకు వారు సహకరిస్తున్నారని అనుమానంతో సోదాలు నిర్వహించాయి.

ఈ సందర్భంగా మొత్తం 27 కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నాయి. అత్యవసర పరిస్థితి విధించిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అక్కడ సంచలనంగా మారింది. ఈ ఘటనపై టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రహీం వహీద్ స్పందిస్తూ ఈ వీడియోను తాము అప్లోడ్ చేయలేదని, అనవసరంగా తమ చానెల్పై బలగాలు దాడులు నిర్వహించి సోదాలు చేసి ప్రసార కార్యక్రమాలు ఆపేశాయని చెప్పారు.

'ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనుకకు తీసుకోవాలి. ఈ మేరకు చేసిన చట్టాన్ని కూడా రద్దు చేయాలి. లేదంటే 30 రోజుల్లోగా అధ్యక్షుడు, టూరిజం మంత్రులపై దాడులు చేస్తాం. హత్యలు చేస్తాం. ఉగ్రవాద కార్యకలాపాలతో హోరెత్తిస్తాం' అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పేరిట యూట్యూబ్లో మాల్దీవుల అధ్యక్షుడిని బెదిరిస్తూ ఓ వీడియో సంచలనం రేపింది. దీని గురించి పోలీసులు కోర్టు అనుమతితో ఆరా తీయగా అది 'స్లావరీ స్లేవ్' అనే పేరుతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సంకేతంతో పోస్ట్ చేశారు. ఇది సాంగు టీవీ పేరిట యూట్యూబ్లో అప్ లోడ్ చేసినట్లుగా ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maldives  tv station  riding  Abdulla Yameen  islamic state video  

Other Articles