muslim polygamyis heinously patriarchal says gujarat high court

Gujarat high court says polygamy should be abolished across india

polygamy, polygamy in muslims, muslim polygamy, muslim marriage, muslim, gujarat high court, india news, latest news

The court was of the opinion that in absence of a uniform civil code having more than one wife is not an offence in the Muslim community. It, however, observed polygamy “is an exception and not a rule.”

అథమకాలం నాటి చట్టాలతో అమ్మాయిల సంఖ్య తగ్గుతోంది..

Posted: 11/06/2015 08:28 PM IST
Gujarat high court says polygamy should be abolished across india

ముస్లింలు ప్రస్తుతం అవలంభిస్తున్న వివాహ విధానంపై గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం వ్యక్తి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది మహిళలను నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చనే చట్టాలు ఆదిమకాలం నాటివని, నేటి సామాజిక పరిస్థితుల్లో అలాంటి చట్టాలను మనుషులను మరింత వెనుకబాటులోకి నెట్టేస్తాయని కోర్టు అభిప్రాయపడింది. అహ్మదాబాద్కు చెందిన ఓ ముస్లిం వివాహిత, తన భర్త రెండో పెళ్లి చేసుకోవడాన్ని సవాలు చేస్తూ పిటీషన్ దాఖలు చేసింది.

ఆ పిటిషన్ విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జె.బి.పార్దివాలా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం ముస్లింలు అనుసరిస్తున్న పాతకాలం నాటి చట్టాలు మహిళల అణిచివేతను ప్రోత్సహించేవిగా ఉన్నాయని, ఈ కారణంగా ఎందరో ముస్లిం వివాహితలు ఇబ్బందులకు గురవుతున్నారని జస్టిస్ పార్దీవాలా అన్నారు.. హిందూ వివాహచట్టాల ప్రకారం ఒక వ్యక్తి ..ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ భావన హిందువులు కాలంతోపాటుగా మారారనడానికి సంకేతంగా నిలుస్తుంది.

అదే ముస్లింల పరిస్థితి మాత్రం ఇంకా పురాతన యుగంలోనే ఉన్నట్లనిపిస్తుంది. దీనిపై మౌల్వీలు, ముస్లిం నాయకులు కూర్చుని చర్చించాల్సిన అవసరం తప్పక ఉంది' అని సూచించారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలైతే ఇలాంటి ఆటవిక చట్టాల్లో మార్పులు సాధ్యమని జస్టిస్ పార్థీవాలా అభిప్రాయపడ్డారు. కాగా, ముస్లిం పర్సనల్ లా బోర్డు చట్టాల ప్రకారం సదరు నిందితుడు తప్పు చేసినట్ లుకాదని తేల్చిన కోర్టు.. ఆమె భార్య దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muslim marriages  common civil code  gujata high court  

Other Articles