29-yr-old becomes grandmother, 14 yr-old becomes father!

14 yr old argentina boy becomes father

29 YR OLD Women, GRANDMOTHER, 14YR OLD boy, Argentina boy 14 becomes father, FATHER, ARGENTINA, father at young age, grand mother young age, Lucia Desiree Pastenez, San Rafael city, Teenage father, 29-year-old grandmother, Child, Adolescence

A 29-year-old woman in Argentina became a grandmother after her 14-year-old son became a father, the media reported.

14 ఏళ్లకే బుడతడు తండ్రయ్యాడు.. 29 ఏళ్ల మహిళ..

Posted: 11/06/2015 06:46 PM IST
14 yr old argentina boy becomes father

స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచమైన ‘చిత్రం’ సినిమాలో చదువవుకునే వయస్సులోనే ఓ పిల్లాడికి తండ్రిగా మారి పడిన ఇబ్బందులు ఆ సినిమా చూసినవారందరికీ తెలుసు. అచ్చం అలాగే.. కాదండీ ఉదయ్ కిరణ్ కన్నా చిన్న పిల్లాడు.. ఇంకా సెకండరీ విద్యను అభ్యసిస్తున్న పిల్లాడు తండ్రిగా మారాడంటే మీరు నమ్మగలరా..? వినడానికి విచిత్రంగా వున్నా ఇది మాత్రం నిజం. అర్జెంటీనాలో 14 ఏళ్ల బాలుడు తండ్రి అయ్యాడు. అతని తల్లి 29 ఏళ్లకే నాయినమ్మ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా అమె తెలిపింది.

వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనాలోని మెన్డోజా రాష్ట్రంలో శాన్ రాఫెల్ నగరం నివాసి లూసియా డిసిరీ పాస్టెనెజ్, తన కుమారుడు తండ్రి అయ్యాడని, అతను అందరిలా కాకుండా నిలదొక్కకునే తండ్రి అని పేర్కోన్నారు. ఇప్పటికీ ఇంకా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తన తనయుడు కుటుంబ విలువలు కలిగి, తన కుమారుడి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. అతని జాగ్రత్తలు కూడా ఆయనే స్వయంగా తీసుకుంటున్నాడని తెలిపారు.

సమాజంలో పిల్లల బాధ్యత తీసుకోకుండా కేవలం వారి స్వార్థం మాత్రమే అలోచించి.. వ్యవహరించే తండ్రులు అనేక మంది వున్నా.. తన కుమారుడు మాత్రం అలా కాకుండా తన బిడ్ల బాధ్యతలను మంచిగా నెరవేరుస్తున్నాడని అమె కితాబిచ్చారు. నలుగురి పిల్లల తల్లిగా తాను తన కుమారిడి సంస్కార జీవితంలో జోక్యం చేసుకోనని చెప్పారు. తన తనయుడి వివాహం చేసుకోవడంలో కానీ, సంస్కారజీవితాన్ని సాగించడంలో కానీ తాను ఎలాంటి బలవంతం చేయలేదని తెలిపారు. అయితే తాము మాత్రం తమ తనయుడికి మద్దతునిస్తాన్నామన్నారు. ఎందుకంటే తెలసీతెలియని అమాయక వయస్సులో పెళ్లి చేసుకుని పిల్లాడి బాధ్యతలను మోయడం ఎంత కష్టమో తాము అర్థం చేసుకోగలమన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 29-yr-old  women  grandmother  14 yr-old boy  father  argentina  

Other Articles