Pastor Baths Woman During Spiritual Healing, What Happened Next

Pastor baths woman during spiritual healing

Pastor Baths Woman During Spiritual Healing, What Happened Next Will Shock You, Pastor Oliver Akpan, spiritual deliverance, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

Pastor Oliver Akpan, has been sent to the great beyond by a married woman he tried To Molest during a spiritual deliverance

మూఢాచార ముసుగులో మహిళపై పాస్టర్ అత్యాచార యత్నం

Posted: 11/06/2015 08:50 PM IST
Pastor baths woman during spiritual healing

గ్రామీణ ప్రాంతాల్లోని మనుషుల మూడనమ్మకాలను అనేక మంది స్వామీజీల పేరుతో సోమ్ము చేసుకోవడం మనం నిత్యం వింటూనే వున్నాం. అయితే ఓ పాస్టర్ అదే మూడాఛారాలను అదునుగా చేసుకుని ఏకంగా ఓ వివాహితపై అత్యాచార యత్నం చేయబోయాడు. అంతేకాదు ఏకంగా హత్య చేయబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే నైజీరియాలోని క్రాస్ స్టేట్ రాష్ట్ర పరిధిలోని అక్పబుయో పురపాలక సంఘంలో ఓ చర్చి పాస్టర్ తన వద్దకు వచ్చిన ఓ వివాహిత ఏకమ్మ వచ్చి తన సమస్య గురించి చెప్పుకుంది. తనను ఏవో దుష్టశక్తులు వేదిస్తున్నాయి. వాటి నుంచి తనకు విముక్తి కల్పించాలని పాస్టర్ అలివర్ అక్పన్ ను కోరింది.

ఏకమ్మ సమస్యను విన్న పాస్టర్ అమెకు వాటిని నుంచి విమోచనం కావాలంటే.. మూడు రోజుల పాటు చర్చిలోనే ఉపవాస దీక్ష చేసి నిద్ర చేయాలని. మూడు రోజులు గడిచిన తరువాత నాల్గవ రోజు పవిత్ర స్నానం అచరించిన తరువాత తాను దుష్టశక్తి అమె నుంచి దూరమవుతుందని నమ్మబలికాడు. పాస్టర్ మాటలు నమ్మిన ఏకమ్మ మూడు రోజుల పాటు చర్చిలో ఉపవాస దీక్ష చేసి నిద్ర కూడా చేసింది. నాల్గవ రోజు అమె పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లగా, వెనుకగా వచ్చిన పాస్టర్ అక్పన్ నగ్నంగా వున్న అమెకు స్నానం చేయించాడు.

అప్పటికే మదిలో వున్న వెదవ అలోచనలను మెల్లిగా అమెపై ప్రయోగించాలనుకున్నాడు. నగ్నంగా వున్న శరీరాన్ని తడుముతూ స్నానం చేయించసాగాడు, అమెను కూడా లోబర్చుకునేందుకు యత్నించాడు. అంతలో అతని అలోచనలు గమనించిన ఏకమ్మ అతడి చర్యలను వ్యతిరేకించింది. అయినా అమెపై పాస్టర్ బలప్రయోగం చేయబోయాడు. అయినా ఏకమ్మ అతడిని ఎదురించింది. పాస్టర్ నుంచి పారిపోయే క్రమంలో అమె పదునైన కర్రను అతడి కడుపులో గుచ్చింది. జరిగిన ఘటనను స్థానిక గ్రామస్థులకు తెలిపేందుకు మహిళ వెళ్లి పలువురిని తీసుకువచ్చింది.

పూర్తి నగ్నంగా వున్న అమెకు స్థానికులు ముందుగా బట్టలను ఇచ్చారు. వెంటనే పాస్టర్ ను చూసేందుకు వచ్చిన స్థానికులు అతను రక్తపు మడుగులో పడివుండటాన్ని చూసి ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే పాస్టర్ అక్పన్ మరణించాడని వైద్యులు తెలిపారు. దీంతో ఏకమ్మను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పోలీసులు అమెను బెయిల్ పై విడుదల చేశారు. ప్రస్తుతం కేసు విచారణ వుంది. కాగా పెళ్లై ఆరుగురు సంతానం వున్న పాస్టర్ అక్పన్ గతంలోనూ వివాహితులు, అవివాహితులైన మహిళా చర్చి సభ్యులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని పలువురు తన మాయ మాటలతో లోబర్చుకుని అనుభవిచారన్న అరోపణలు గుప్పుమంటున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cross River State  Pastor Oliver Akpan  molestation  

Other Articles