nursing student allegedly raped in a moving bus by the driver in bengaluru

Bengaluru 18 year old girl student raped in a moving bus

nursing student, rape, moving bus, nirbhaya incident, Bengaluru Horror, woman gangrape, Bengaluru gangrape, bengaluru, Hoskote, rural Bengaluru, 'Nirbhaya' case in bengaluru, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

In a similar incident as that of the infamous 'Nirbhaya' rape and murder case in Delhi in December 2013, an 18-year-old girl has been raped in Hoskote in rural Bengaluru in a moving bus.

ITEMVIDEOS: బెంగళూరులో మరో నిర్భయ ఘటన.. బస్సులో యువతిపై గ్యాంగ్ రేప్

Posted: 11/06/2015 12:26 PM IST
Bengaluru 18 year old girl student raped in a moving bus

సుమారుగా రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం చేపిన నిర్భయ ఘటన ఇంకా దేశ ప్రజలు మరవక ముందే బెంగళూరులో అదే తరహాలో మరో దారుణం జరిగింది. అటో, క్యాబ్, ఇలా ఏ వాహనాన్ని తీసుకుని ప్రయాణం చేసిన పడతులకు మానప్రాణాలకు మాత్రం రక్షణ కరువైంది. అనునిత్యం అడవారికి వెంట కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు, మగమృగాళ్లు పైశాచికత్యంతో వెంటాడుతున్నారన్న విషయం తెలసినా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు మగవారిని నమ్మాల్సి వస్తుంది. అలా నమ్మిన వారిలో అనేకం వారిని సురక్షితంగా గమస్థానాలకు చేర్చినా.. కొందరు మాత్రం అదను చూసి కామాంధకారంలో అడవారిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు.

తాజాగా బెంగళూరులో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికులతో కూడిన ఓ ప్రేవేటు బస్సు ఎక్కిన ఓ నర్సింగ్ విద్యార్థినిపై డ్రైవర్, క్లీనర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రయాణికులందరూ దిగిపోయిన తరువాత యువతి ఒంటరిగా వుంది. అయితే బస్సులో ఎవరూ లేకపోవడాన్ని అదునుగా భావించిన డ్రైవర్, క్లీనర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also : ఢిల్లీ రేప్ కేసులో.. కామాంధుడికి తగిన శిక్ష..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : nursing student  rape  moving bus  nirbhaya incident  bengaluru  

Other Articles