Uber cab driver gets jail for life for raping woman executive

Uber cab driver gets life sentence in rape case

Uber cab driver gets jail for life for raping woman executive, woman executive raped by uber driver, Uber cab, Uber cab driver, Shiv Kumar Yadav, Additional Sessions Judge Kaveri Baweja, abducted, rigorous imprisonment for life, offence under section 376 (2)(m) (committing rape causes grievous bodily harm) of the IPC, Delhi Legal Services Authority, Uber, Shiv Kumar Yadav, Uber cab driver, life imprisonment, rape, woman executive, Shiv Kumar Yadav

An Uber cab driver was on Tuesday sentenced to life imprisonment till his natural death for raping a woman executive in his taxi 11 months ago by a Delhi court.

ఢిల్లీ రేప్ కేసులో.. కామాంధుడికి తగిన శిక్ష..

Posted: 11/03/2015 08:24 PM IST
Uber cab driver gets life sentence in rape case

దేశ రాజధాని ఢిల్లీలో మహిళా ఎగ్జిక్యూటివ్(25)పై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఉబర్ కారు డ్రైవర్ శివకుమార్ యాదవ్(32)కు న్యాయస్థానం తగిన శిక్షే విధించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోన్న శివకుమార్ యాదవ్ ను దోషిగా నిర్థారించిన న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించింది. మంగళవారం ఢిల్లీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఢిల్లీ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బావేజా తీర్పును వెలువరిస్తూ..దారుణమైన నేరానికి పాల్పడిన దోషికి ఎట్టి మినహాయింపులు ఇవ్వలేమని పేర్కోంటూ జీవితఖైది శిక్షను విధించారు. గత నెల 21న శివకుమార్ను దోషిగా నిర్దారించిన కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారుచేసింది.

గత ఏడాది డిసెంబర్ 5న రాత్రి గుర్గావ్‌లో పనిచేసే అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఇంటికి వచ్చేందుకు ఉబర్ క్యాబ్ అద్దెకు తీసుకుంది. తన స్నేహితులతో కలసి ప్రయాణం చేసిన అమె మార్గమద్యంలో అందరినీ దింపిన తరువాత అలసిపోయిన అమె నిద్రలోకి జారుకుంది. అయితే ఇంటికి వచ్చే క్రమంలో కారు డ్రైవర్ శివకుమార్ ఆమెను నిర్ఝన ప్రాంతానికి తీసుకువెళ్లి అమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టడమే కాకుండా గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత మధురలో నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uber cab driver  life imprisonment  rape  woman executive  Shiv Kumar Yadav  

Other Articles