Telangana E pass | telangana epass website | error | uploading details | intermediate first year students | scholarship applications

Inter fresh scholarship applications telangana e pass website shows error after uploading details

Telangana E pass, telangana epass website, telangana epass website error, error in telangana e pass, error in scholarship applications, scholarship uploading details, intermediate first year students, scholarship applications error, telangana government, scholarship, website error, fresh applications, inter 1 yr students

Telangana E pass website shows error after uploading details of intermediate first year students scholarship applications

ఇంటర్ విద్యార్ధుల పాలిట ‘ఎర్రర్’ గ్రహణం

Posted: 11/05/2015 02:59 PM IST
Inter fresh scholarship applications telangana e pass website shows error after uploading details

ఇంటర్ తొలి సంవత్సరం చదవుతున్న విద్యార్థులకు ఉన్నత విద్య ప్రతిబంధకంగా మారుతుంది. అదెలా అంటే.. ప్రభుత్వం వారికిచ్చే ఫీజు రియంబర్స్ మెంట్ అందుతుందా అన్న అనుమానాలు వారిలో కలుగుతున్నాయి. పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు ఉన్నత విద్యలో భాగంగా ఇంటర్మీడియట్ తొలి సంవత్సరంలో అడుగుపెట్టారు. కోటి ఆశలతో ఎదురుచూసిన విద్యార్థులకు స్కాలర్ షిప్ అందోళన కలిగిస్తుంది. గత నెల 30లోపు ఉన్నత విద్యను అభ్యసించే పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు స్కాలర్ షిఫ్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఇంతవరకు బాగానే వున్నా గతంలో స్కాలర్ షిప్ పోందిన విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులను  ఎదుర్కోనలేదు. అయితే తొలిసారిగా స్కాలర్ షిఫ్ ల కోసం దరఖాస్తు చేసుకోబోయే విద్యార్థులు ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు మాత్రం ఎర్రర్ గ్రహణం పట్టి పీడిస్తుంది. తెలంగాణ ఈ పాస్ పైట్ ద్వారా ధరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఎంతగా ప్రయత్నించినా.. గత నెల 27 నుంచి విద్యార్థులకు ఎర్రర్ ఇబ్బంది పెడుతోంది.

అసలే సైట్ లో తమ వివరాలను అప్ లోడ్ చేస విద్యార్థుల సంఖ్య అధికం కావడంతో సైట్ నెమ్మదిగా స్పందించి.. అనేక పర్యయాలు ప్రయత్నం చేసిన తరువాత వివరాలన్నీ తీసుకున్న పిమ్మట.. మీ ధరఖాస్తు అప్ లోడ్ చేస్తున్న సమయంలో ఎర్రర్ సంభవించిందంటూ ఓ మేసేజ్ రావడం విద్యార్థులను కలవరానికి గురిచేసింది. దీంతో అదే పనిగా విద్యార్థులు 28, 29. 30 తేదీలలో ప్రయత్నం చేసినా.. అదే సమాధానం. దీంతో నెట్ సెంటర్ల వద్ద 29. 30 తేదీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థుల, వారి తల్లిదండ్రులు గుమ్మిగూడారు.

ఈ పరిస్థితులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 15 వరకు స్కాలర్ షిఫ్ లను దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు ఉపశమనం కల్పించింది. అయితే గతంలో మాదిరిగా చివరి రోజున ఇబ్బందులు ఎందకని 1వ తేదీ నుంచి విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం తమ వివరాలను అప్ లోడ్ చేయాలని ప్రయత్నించగా, వారికి మళ్లీ చేదు అనుభవమే ఎదురవుతుంది. ఎర్రర్ అడ్డుగోడ వారికి ప్రతిభందకంగా మారుతుంది. దీంతో తమకు ఈ ఎర్రర్ గ్రహణం వీడి తమ వివరాలు సైట్ లో అప్ లోడ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం విద్యార్థులు కోరుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles