chinese woman searching for pakistani boyfriend

Chinese woman searching for pakistani boyfriend

china, Pakistan, pakistan, china girl, Pakistan lover

A Chinese woman who arrived in Muzaffargarh allegedly in search of her ‘boyfriend’, Amin, was taken into protective custody by district police. Tein Domi alias Dolly, a 23-year-old, worked as a clerk in a medical college in China where Amin, a Pakistani national, was studying medicine. The 23-year-old claimed the two both were in relationship and that she even sold her house to pay his college fee.

పాకిస్థాన్ ప్రియుడి కోసం చైనా ప్రియురాలు

Posted: 11/05/2015 03:31 PM IST
Chinese woman searching for pakistani boyfriend

ప్రేమ యాత్రలకు బృందావనమూ.. నందవనమూ ఏలానో.. ప్రేమించే చెలి చెంతనుండగో వేరే స్వర్గము ఏలనో.. అంటూ పాత డ్యుయెట్ సాంగ్ అందరికి గుర్తిండే ఉంటుంది. మరి ప్రియుడు, ప్రేయసి దగ్గరుంటే వారికి వేరే ఎవరూ అక్కర్లేదు. కానీ తను ప్రేమించిన వ్యక్తి పక్కన లేకపోతే.. ఆ విరహ బాధ వర్ణనాతీతం. అయితే అచ్చం ఇలాంటి లవ్ స్టోరీలాగే ఓ చైనా అమ్మడు తన ప్రియుడిని వెతుక్కుంటూ.. ఏకంగా దేశం కాని దేశం పాకిస్థాన్ లో వెతకడం వార్తల్లో నిలిచింది. ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. ప్రేమ ప్రాణాలు పోస్తుంది. ప్రాణాలు తీస్తుంది. ఇప్పుడు అలాంటి ప్రేమకోసం ఓ ప్రేయసి తన ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి దేశం కాని దేశంలో 20 రోజుల నుంచి వెతుకుతోంది.

చైనాకు చెందిన తీన్ డామి అలియాస్ డాలీ(23) యువతి మెడికల్ కాలేజ్ లో క్లర్క్ గా పని చేస్తోంది. ఆ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చదువుతొన్న పాకిస్తాన్ యువకుడు అమీన్ తో పరిచయం ప్రేమగా మరింది. అమీన్ కాలేజ్ ఫీజు కోసం ఉన్న ఇంటిని కూడా అమ్మేసింది. కాగా నెల రోజుల క్రితం డాలీకి చెప్పకుండానే అమీన్ పాకిస్తాన్ వెళ్లిపోయాడు. డాలీ ప్రియుడి చిరునామా తో అతనిని వెతుక్కుంటూ... పాక్ చేరుకొని గత 20 రోజులగా ఇస్లామాబాద్, ముజఫర్ గడ్ ప్రాంతాలన్నీ వెతుకుతోంది. ఆమె వెతుకుతున్న తీరుతో పోలీసులకు అనుమానం వచ్చి డాలీని పోలీసులు విచారించగా అసలు విషయం వెల్లడించింది. దీంతో ఆమెను చైనా దౌత్యకార్యాలయానికి పాక్ పోలీసులు అప్పగించారు. కానీ తన ప్రియుడు అమీన్ ను కలిసిన తర్వాతే చైనా తిరిగి వెళ్తానని అంతవరకు పాక్ ను వదిలి పోనని తెలిపింది. దీంతో పోలీసులు అమీన్ కుటుంబ సభ్యులను సంప్రదించగా అమీన్ చైనాలో ఉన్నాడని చెప్పారు. దీంతో డాలీ తనను కలిసేందుకు అమీన్ ఇష్టపడటం లేదని తెలుసుకొని కన్నీరు పెట్టుకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  Pakistan  pakistan  china girl  Pakistan lover  

Other Articles