traders concern on chandrababu government

Traders fires ap government alleges officials harassment

traders fires ap government, traders alleges on commercial tax officials, traders officials harassment, traders yanamala ramakrishnudu, Minister yanamala Rama Krishna, Traders concern, Chandrababu Government

traders fires andhra pradesh government, in the presence of minister Yanamala ramakrishnudu, alleges commercial tax officials harassing them daily

మేం చంబల్ లోయ దొంగలమా..? శత్రువులమా..?

Posted: 11/05/2015 01:54 PM IST
Traders fires ap government alleges officials harassment

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక తాము ప్రతి నిత్యం ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నామని వ్యాపారులు తమ అవేదనను వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి వ్యాపారాలు చేస్తున్న తమపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని.. చీటికీ మాటికీ తనిఖీలు, దాడులు చేస్తూ జరిమానాల మీద జరిమానాలేస్తున్నారని వారు వాపోయారు. అధికారుల తీరు వల్ల తాము మానసిక క్షోభకు గురవుతున్నామని.. వే బిల్లు, లోకల్ వే బిల్లు, జంబ్లింగ్ అంటూ తమను హింసిస్తున్నారని వారు మొరపెట్టుకున్నారు. అధికారులు తమను చంబల్ లోయ దొంగల్లా చూస్తున్నారు. శత్రువుల్లా పరిగణిస్తున్నారు. ఈ వేదింపులను తక్షణం ప్రభుత్వం అపకపోతే.. తమకు కూడా ఆత్మహత్యలే శరణ్యమని వారు తమ అక్రోశాన్ని వెల్లగక్కారు.

ప్రభుత్వ ఒత్తిళ్లు, అధికారుల వేధింపుల పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ట్రేడర్స్‌తో రాష్ర్ట ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమైన సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడారు. రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ... ‘‘సేల్స్ ట్యాక్స్ అధికారులకు, వ్యాపారులకు మధ్య సుహృద్భావ వాతావరణం లేదు. జంబ్లింగ్ పేరిట అధికారులు వేధిస్తూ నరకం చూపిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎక్కువగా నష్టపోయింది తామేనని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో చిల్లర వర్తకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. అమ్మకాల్లేక అద్దెలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామన్నారు. వ్యాపారులను దొంగల్లా చూస్తారా? అంటూ నిలదీశారు.

మోటార్ వాహనాలపై తీసుకెళ్లే సరుకులకే వే బిల్లులు ఇవ్వాలని చట్టంలో ఉందని విశాఖ స్టీల్ అండ్ సిమెంట్ అసోసియేషన్ ప్రతినిధి పాలూరి సూర్యనారాయణ చెప్పారు. అయితే, రిక్షాలు, తోపుడుబండ్లపై తీసుకెళ్లే ఐరన్ వంటి వాటికి కూడా వే బిల్లులు కావాలంటూ అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయిని పరిగణనలోకి తీసుకోకుండా భారీగా వసూళ్ల లక్ష్యాలను నిర్దేశిస్తుండడంతో కిందిస్థాయి అధికారులు ఒత్తిడికి గురవుతున్నారని విజయనగరం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కో చైర్మన్ ఆశీష్‌కుమార్ పేర్కొన్నారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలున్నా రూ.వేలల్లో అపరాధ రుసుంలు వేస్తున్నారని ఆరోపించారు.  

ముప్పై ఏళ్లుగా వ్యాపారాలు చేస్తూ క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసి, సకాలంలో పన్నులు చెల్లించే వారిని కూడా దొంగల్లా సంస్థల ముందు నిలబెట్టి ఫొటోలు తీస్తున్నారని విజయనగరం జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎన్.వి.చలం .ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు కట్టని వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప అందరినీ ఒకే గాటన కట్టడం సరి కాదని అన్నారు. దాదాపు రూ.10 వేల విలువైన సరుకు తెచ్చుకునేవారిని కూడా అడ్వాన్స్ వే బిల్లు కోసం ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అధికారులకు భారీ లక్ష్యం విధించడం వల్లే వారు తమను వేధిస్తున్నారని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minister yanamala Rama Krishna  Traders concern  Chandrababu Government  

Other Articles