man left grand daughter 5 in desert with loaded gun

Cops man left granddaughter 5 in desert with loaded gun

Crime, Child abuse, weird crimes, Maricopa County, Arizona, guns, loaded gun, grandfather, desert, Paul Rater, Joe Arpaio, arizona, paul rater, Loaded gun, girl, granddaughter, desert, initial court appearance, Buckeye man, 5-year-old granddaughter, 45-caliber handgun, Maricopa County Sheriff, off-duty firefighter, Gila River south

Paul Rater left is granddaughter in the desert with a loaded gun. He described what happened in his initial court appearance.

లిటిల్ సోల్జర్.. ఎడారిలో తుపాకీతో ఐదేళ్ల చిన్నారి..!

Posted: 11/05/2015 12:32 PM IST
Cops man left granddaughter 5 in desert with loaded gun

అమ్మమ్మ తాతయ్యలంటే పిల్లలకు చాలా ఇష్టం.. ఎందకంటే ఎక్కడో దూరన వుండే తమ కూతురు పిల్లలను వారు ఆప్యాయంగా చూసుకుంటారు కాబట్టి. అది ఎంతలా అంటే ఎవరి తాహత్తు బట్టి వారు.. తమ మనమలకు, మనమరాళ్లకు కోరిందల్లా కాదనకుండా తెచ్చిపెట్టి వారిని సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తారు. చాలా మందికి ఈ మధుర జ్ఞాపకాలు గుర్తిండే వుంటాయి. లేదా తమ పిల్లలను వారు ఎలా గారాభం చేస్తారో చూస్తువుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ తాతయ్య తన మనవరాలిని లిటిల్ సోల్జర్ గా మార్చాలనుకున్నాడో ఏమో.. తన మనవరాలికి భయంకరమైన అనుభవాన్ని మిగిల్చాడు. అదెలా అంటారా..?

తనతో పాటు బయటికి  తీసుకెళ్లిన మనవరాలిని ఎడారిలో వదిలేశాడు. అంతేకాదు 45 కాలిబర్  తుపాకీని ఫుల్ గా లోడ్ చేసి, ఆమెకిచ్చి కామ్ గా ఇంటికి వచ్చేశాడా తాతయ్య . అమెరికాలోని ఆరిజోనాలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. పాప కనిపించకపోవడంతో  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా గాలింపు  చర్యలు చేపట్టారు. గిలా నదికి వెళ్లే మార్గంలోని  ఎడారిలో ఆమె ఆచూకీ కనుగొన్నారు. మారికోపా కౌంటీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం   పాల్ రాటర్ (53) మనవరాలితో బయటకు వెళ్లాడు. ముందు బర్గర్ తిని, ఫుల్ గా మద్యం సేవించాడు.

ఆ తరువాత ఆ చిన్నారికి లోడ్ చేసిన గన్ ఇచ్చాడు. మద్యం మత్తులో ఉన్నాడో ఏమో తెలియదు కానీ ఆ చిన్న పిల్లను ఎడారిలో ఒంటరిగా వదిలేసి వెనక్కి వచ్చేసాడు.  పాపను కనీసం ఎడారిలో వదిలేసినట్లు కూడా ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు నేపథ్యంలో చిన్నారిని హింసించిన కేసులో పాల్ రాటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పాప ఇక నడవలేనని చెప్పడంతో అందుకే ఆమెను ఓ చెట్టుకింద వదిలేసినట్లు రాటర్ విచారణ అధికారులతో చెప్పాడు. తాతయ్య  ఎందుకిలా చేశారో అర్థం కాలేదని బెదిరిపోతున్న కళ్లతో ఆ చిన్నారి తన  అమ్మమ్మతో తెలిపింది. ఎట్టకేలకు చిన్నారి క్షేమంగా తమ వద్దకు చేరటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Crime  Child abuse  arizona  paul rater  Joe Arpaio  5 yr girl  

Other Articles