Sonia Gandhi attend six and Modi attend twenty five rallies in Bihar

Sonia gandhi attend six and modi attend twenty five rallies in bihar

Modi, Sonia Gandhi, Bihar, elections, Congress, Nitesh Kumar, lalu prasad, BJP

Acknowledged as a master orator by followers and political adversaries alike, Prime Minister Narendra Modi has addressed 25 rallies as the star campaigner of the BJP-led NDA -- the most by any recent prime minister.No prime minister before Modi has ever visited Bihar more than two-three times during assembly elections in the past. Modi addressed four rallies in the state in July and August even before the announcement of the Assembly polls, with two official visits during the same period.

సోనియా 6, రాహుల్ 15, మోదీ 25

Posted: 11/03/2015 08:15 PM IST
Sonia gandhi attend six and modi attend twenty five rallies in bihar

బీహార్ బరిలో అన్ని పార్టీలు సిగపట్టుపట్టాయి. నువ్వా నేనా అన్నట్లు సాగిన బీహార్ ఎన్నికల ప్రచారం కురుక్షేత్రాన్ని తలపించింది. అధికార పక్షం, ప్రతిపక్షం, తోక పార్టీలు అన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. జనాలను సమీకరించిన దగ్గరి నుండి.. ఎదుటి నేతల మీద విమర్శలు చెయ్యడం వరకు అన్ని పక్షాలు తమ పంథాను నిరూపించుకున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ధీటుగా బీహార్ గడ్డ మీద ఎన్నికల పవనాలు పార్టీల మధ్య రికార్డుల మోత మోగించింది. కాంగ్రెస్ అధినేత్రి 6కు పరిమితం కాగా నరేంద్ర మోదీ మాత్రం 25తో దూసుకుపోయారు. ఈ 6, 25 ఏంటీ అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.

బీహార్ ఎన్నికల బరిలో అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. అధికారం కోసం బిజెపి పార్టీ, బిజెపికి తప్ప ఏ పార్టీకి అయినా పర్లేదు అన్నట్లు నితీష్ కుమార్ ను సమర్థిస్తూ.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. అయితే ఎన్నికల సబల నిర్వహణలోనూ అన్ని పార్టీలు పోటీ పడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. తన ఎన్డీయే ప్రభకు ఈ ఎన్నికలు అద్దంపడతాయని ఆయన భావిస్తున్నారు అందుకే బీహార్ లో రికార్డ్ స్థాయిలో 25 సభల్లో పాల్గొని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక మోదీకి పరాభవం కలిగించాలని గట్టిగా తలుచుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేవలం 6 సభలతో సరిపెట్టుకుంటే.. కాంగ్రెస్ యువరాజు 15 సభల్లో ప్రచారం నిర్వహించారు. ఇక నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ లు ఏకంగా దబుల్ సెంచరీ కొట్టేశారు. రికార్డు స్థాయిలో సభల్లో పాల్గొని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ఎన్డీయే తరపున బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ 200, జీతన్ రామ్ మంజీ 150, అమిత్ షా, రామ్ విలాస్ పాశ్వాన్ దాదాపు చెరో వంద ర్యాలీల్లో ప్రసంగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Sonia Gandhi  Bihar  elections  Congress  Nitesh Kumar  lalu prasad  BJP  

Other Articles