Nagarjuna pushes media mikes

Nagarjuna pushes media mikes

Nagarjuna, Hero Nagarjuna, Hero Nagarjuna news, Nagarjuna on Media, Nagarjuna in Hyderabad, Nagarjuna updates

Telugu Hero nagarjuna pushes media mikes at a function. Media persons questions intolerance in India. But Nagarjuna pushes media mike and went from there.

ITEMVIDEOS: మీడియా మైకులను తోసేసిన హీరో నాగార్జున

Posted: 11/03/2015 06:30 PM IST
Nagarjuna pushes media mikes

హీరో నాగార్జున తన అసహనాన్ని మీడియా మీద ప్రదర్శించారు. ఓ పంక్షన్ కు హాజరైన నాగార్జునను మీడియా వాళ్లు రకరకాల ప్రశ్నలు వేశారు. అయితే మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకూడదని అనుకున్నారో లేదంటే.. ఇష్టం లేదో తెలియదు కానీ మీడియా వాళ్లు పెట్టిన మైకులను తోసి వెళ్లిపోయారు. అయితే అంతకు ముందే షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ ఆ విషయం మీద మాట్లాడటంతో నాగార్జున కూడా ఇదే విషయం మీద స్పందిస్తారని అనుకున్నారేమో.. అందుకే మీడియా వాళ్లు కాస్త దూకుడు ప్రదర్శించారు. కానీ నాగార్జున మాత్రం వాటికి సమాధానాలు చెప్పకుండా.. మైకులను తోసి వెళ్లిపోయారు. అసలు నాగార్జున అలా ఎందుకు చేశారు..? అనే ప్రశ్నకు కింద సమాధానం ఉంది.


కమల్ హాసన్ దేశంలో తలెత్తిన అసహనం మీద స్పందించారు. కళాకారులు తమకిచ్చిన అవార్డులను వెనక్కి ఇవ్వడం ద్వారా తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని.. కానీ అది సరైన పద్దతి కాదని అన్నారు. అలాగే షారుఖ్ ఖాన్ కూడా తనకు జాతీయ స్థాయిలో అవార్డులు రాలేదని... వ్యాఖ్యానించారు. కాగా ఇదే విషయం మీద వీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. షారుఖ్ ఖాన్ దేశంలో పెరుగుతున్న అసహనం మీద అలా స్పందించారు మరి మీరేమంటారు..? అని ప్రశ్న పూర్తి చేసేలోపే.. మీడియా మైకులను తోసుకుంటూ వెళ్లిపోయారు. అయినా తన కొడుకు సినిమా వాయిదా పడింది అని చెప్పడానికి మీడియా సమావేశం పెడతారు కానీ మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు మాత్రం ఇలా తన అసహనాన్ని ప్రదర్శిస్తారా..? అని కొందరు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles