chinese lover proposes with diapers instead of diamonds

Chinese man proposes his love differently

chinese man proposes his love differently, diapers, drones, love, marriage, pregnant, proposals, romantic, romantic gestures, Chinese lover, diapers, Guangdong province, Guangzhou city

After learning his girlfriend is pregnant, guy proposes with 4,500 diapers arranged in shape of heart

విభిన్నంగా ప్రేమను వ్యక్తం చేశాడు.. ప్రేయసి మనస్సును గెలిచాడు

Posted: 11/03/2015 08:22 PM IST
Chinese man proposes his love differently

ఆ మధ్య ఓ ప్రియుడు తన ప్రేయసి మనస్సును గెలుచుకునేందుకు 99 సెల్ ఫోన్ లతో ప్రేమను వ్యక్తపర్చినా.. అమె తిరస్కారంతో చేసేది లేక నిరుత్సాహంగా వెనుదిరిగాడు. తాజాగా, మరో ప్రేమికుడు కూడా అదే పంథాలో తన ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా వ్యక్త పరిచాడు. ఈ రెండు సంఘటనల్లో వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కింది మాత్రం చైనా ప్రేమికులే. ప్రేమను ప్రపోజ్ చేయడంలో డైమండ్ రింగ్ బదులుగా డైపర్స్ ను వినియోగించాడు. సుమారుగా 4500పైగా డైపర్ లతో ప్రపోజ్ చేసి తన ప్రేయసి మనస్సును కూడా గెలుచుకున్నాడు.

గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన ఫెంగ్ రెండేళ్ల పాటు తన ప్రియురాలితో ప్రేమాయణం సాగించాడు. ఆమె నెల తప్పిందని తెలుసుకుని తన ప్రేమను వెరైటీగా తెలపాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. తన స్నేహితుల సహాయంతో 4500 డైపర్లు కొని వీటిని 50 బ్యాగుల్లో పెట్టి హృదయాకారంలో ప్యాక్ చేశాడు. పెర్ల్ నది ఒడ్డున తన ప్రియురాలికి దీన్ని బహూకరించి ప్రేమను వ్యక్తం చేశాడు. అంతేకాదు మరో సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు.

డ్రోన్ సహాయంతో మరో డైపర్ బ్యాగ్ ను ఆమెకు అందించాడు. ఇది ఓపెన్ చేయగానే ఫెంగ్ ప్రియురాలి ముఖం సంభ్రమాశ్చర్యాలతో వెలిగిపోయింది. డైపర్ బ్యాగ్ లోపల డైమండ్ రింగ్ పెట్టి ఆమెను ఆశ్చర్యపరిచాడు. 'ఈరోజు నుంచి నిన్ను, మనకు పుట్టబోయే బిడ్డను సంతోషంగా ఉంచడం నా బాధ్యత. నన్ను పెళ్లి చేసుకోమని కోరుతున్నా' అని ప్రపోజ్ చేయగా ఆమె వెంటనే అంగీకరించింది. అది చాలదన్నట్లు తన స్నేహితులతో విల్ యు మ్యారీ మీ..? (నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా..?) అని కూడా ప్లకార్డులు పట్టించాడు. మొత్తానికి తన ప్రేమను గెలిపించుకున్నాడు. విష్ దమ్ అల్ ది బెస్ట్.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese lover  diapers  Guangdong province  Guangzhou city  

Other Articles