where is intolerance

Where is intolerance

Arun Jaitley, intolerance, rising intolerance, Congress march, Congress, BJP, Presiednt's house, Pranab Mukherjee

Hours before the Congress party's march to the President's House to highlight the alleged rise in incidents of intolerance, Finance Minister Arun Jaitley asserted: "Where is intolerance? This country has never been and will never be intolerant."Congress President Sonia Gandhi and her son Rahul Gandhi led the party's parliamentarians and top leaders in a march this afternoon to the Rashtrapati Bhawan. On Monday, Mrs Gandhi reportedly raised incidents related to intolerance in a one-on-one meeting with President Pranab Mukherjee.

అసహనమా ఎక్కడ..? జైట్లీ ప్రశ్న

Posted: 11/03/2015 06:01 PM IST
Where is intolerance

కేంద్ర ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. దేశంలో మత అసహనం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో అసహనం ఎన్నడూలేదని, ఆ మాటకే భారతంలో తావులేదని ఆయన అన్నారు. దేశంలో అసహనం, ఆందోళన కలిగించే ఘటనలు పెరిగి పోతున్నాయని ఆందోళన చేస్తూ పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ పార్టీ మార్చ్ కు సన్నదం అయింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, నాయకులు రాష్ట్రపతి భవన్ కు మార్చ్ జరుపుతున్నారు. సోనియాగాంధీ ఇది వరకే ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీతో సమావేశంలో కూడా దేశంలో తలెత్తిన అసహనం గురించే ప్రస్తావించారు.

దేశంలో ప్రశాంతికి, మత సామరస్యానికి ఎలాంటి భంగం వాటిల్లలేదని.. జరగకూడని కొన్ని చిన్నచిన్న సంఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినా, వాటిని భూతద్దంలో చూపి గగ్గోలు చేయడం భావ్యం కాదని అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. అసహనం ఎక్కడుందో కాంగ్రెస్ చెప్పాలని నిలదీశారు. జరిగిన ఘటనలు కూడా కాంగ్రెస్, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే జరిగాయితప్ప.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాదన్న విషయాన్ని గమనించాలని హితవు చెప్పారు. ఇందిరిగాంధీ హత్యానంతరం సిక్కుల ఊచకోత జరిగి 31 ఏళ్లు జరిగిన సందర్భంగా ఆ దారుణ మారణ కాండకు బాధ్యులైన పార్టీ ‘అసహనం’ పెరిగిపోతోందని గగ్గోలు పెట్టడం సిగ్గుచేటని ప్రధాని మోదీ విమర్శించారు. ఇటీవల హేతువాదుల హత్య, గోమాంసం తిన్నాడన్న పుకార్లతో ఓ వ్యక్తిని అల్లరిమూక కొట్టి చంపిన ఘటనతో దేశంలో అసహనం పెరిగిపోతోందనే చర్చ మొదలైంది. నిరసనగా కొందరు రచయితలు, కళాకారులు అవార్డులు వాపస్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles