Geeta has not acknowledged Mahtos as parents, DNA test awaited

Geeta says mahto family is not hers

geeta india pakistan, geeta indian girl lost in pakistan, geeta indian in pakistan, geeta return india, geeta indian girl, geeta in pakisatan, geeta stranded in pakistan, edhi foundation, nation news, india news, latest news

in the latest twist in the case, Geeta has refused to recognise Mahatos, who claimed to be her family, as parents.

అజ్ఞాత వాసం వీడినా.. కన్నవారి అన్వేషణ కొనసాగుతుంది

Posted: 10/26/2015 07:01 PM IST
Geeta says mahto family is not hers

అది పాకిస్థాన్ లోని లాహార్ రైల్వే స్టేషన్లలో సంజౌతా ఎక్స్ ప్రెస్ రైళ్లో ఒంటరిగా కూర్చోనివున్న ఓ ఏడు ఎనమిదేళ్ల చిన్నారిని.. దిగాలుగా వుండటం చూసి అక్కున చేర్చుకున్నారు పాకిస్థాన్ రేంజర్లు. అయితే ఏం అడిగినా చెప్పడానికి, కనీసం వినడానికి కూడా అవకాశంలేని బాలిక పరిస్థితిని గమనించిన రేంజర్లు అమెను చేరదీశారు. అలా దశాబ్దమున్నర కాలం గడిచింది. ఇప్పుడామే సంచలనంగా మారింది. ఇరు దేశాల మధ్య వాడిన స్నేహానికి వారధిగా మారింది పాకిస్థాన్లోని గీత తమ బాలికేనంటూ భారత్ లో అమె తల్లిదండ్రులు గుర్తించారు. అయితే ఈ కథలో మరో ట్విస్టు ఏర్పడింది. మొదట్లో అమె కూడా వారిని గుర్తు పట్టింది. అయితే ఇక్కడే ఇప్పుడ అసలు ప్రశ్న తలెత్తింది.

ఈ ఉదయం ఇండియాకు వచ్చిన గీత, బీహార్ నుంచి వచ్చిన జనార్దన్ మహతో తన తండ్రి కాదని చెప్పింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మధ్యాహ్నం వెల్లడించారు. గీత తనవారిని గుర్తు పట్టలేకపోయిందని ఆమె తెలిపారు. బీహారుకు చెందిన మహతో కుటుంబంతో తనకు సంబంధం లేదని గీత చెప్పిందని, గీత చిన్నప్పటి చిత్రాలుగా వారు చూపిన ఫోటోలు తనవి కావని స్పష్టం చేసిందని సుష్మా వెల్లడించారు. దీంతో గీత వ్యవహారం కొత్త ట్విస్ట్ తిరిగినట్లయింది. మరి, ఈ కథ ఎక్కడికి వెళుతుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. ఈ నేపథ్యంలో గీత తండ్రిగా చెబుతోన్న వ్యక్తినుంచి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు శాంపిల్స్ సేకరించారు. ఒకవేళ డిఎన్‌ఏ పోలితే మాత్రం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.

అయితే గీతకు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అండగా నిలిచారు. గీత అమె తల్లిదండ్రులను గుర్తించలేకపోయినా పర్వాలేదని, అమె భారతీయ బిడ్డని, అమె తన తల్లి భరతమాత ఒడికి చేరడమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఆ తరువాత అమె తల్లిదండ్రుల కోసం అన్వేషణ సాగిస్తామన్నారు. గీత యోగక్షేమాలను తాము చూసుకోగలమని సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  India  Edhi Foundation  Geeta  Karachi  Bihar  Deaf-mute girl  Sushma Swaraj  

Other Articles