Rahul Gandhi Takes Swipe at PM in Bihar

Rahul gandhi takes swipe at pm in bihar

Bihar elections 2015, Bihar polls, Rahul Gandhi, Bihar, Rahul Gandhi Motihari, Rahul Gandhi in Bihar

As they both campaigned in Bihar, Rahul Gandhi today tore into Prime Minister Narendra Modi for what he called false promises to the people of India. "Stop lying and start working," the Congress vice president said at a rally two days before the third round of voting for state polls. "Now the PM is realizing that the people of India are smart and they are wise to his lies. Modiji, stop lying and start working," Mr Gandhi said, addressing a rally in Motihari.

అబద్దాలు మానండి మోదీ గారు

Posted: 10/27/2015 08:27 AM IST
Rahul gandhi takes swipe at pm in bihar

ప్రధాని మోదీ ముందు అబద్దాలు చెప్పడం మానాలని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సూచించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ మోదీ మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బీహార్ అభివృద్ధి కోసం ప్రధాని ప్రకటించిన ఆరు సూత్రాల పథకం సహా ఆయన వాగ్దానాలన్నీ అబద్ధాలేనని దేశ ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. మోదీజీ! మీకు ఆరెస్సెస్ శిక్షణ ఇచ్చిందని మాకు తెలుసు... ఈ వాగ్దానాలన్నీ ఆరెస్సెస్ శిక్షణలో నేర్చుకున్నవే... అని రాహుల్ విమర్శించారు. మీరు ప్రధానిగా అబద్ధాలు చెప్పడం మానుకుని దేశ ప్రగతి కోసం పని చేయడం ప్రారంభించండి అని సూచించారు.

బీహారీ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి జేడీయూ, ఆర్జేడీలే కారణం అన్న ప్రధాని మోదీ ఆరోపణలు పూర్తిగా అసత్యమని అభిప్రాయపడ్డారు. మోదీజీ వస్తారు. భారీ ప్రసంగాలు చేస్తారు. మహారాష్ట్రలో జీవిస్తున్న బీహారీల పట్ల ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యహహరించే తీరేమిటో చెప్పాలని మీరు ఆయన (మోదీ)ను ప్రశ్నించండి. అక్కడ నుంచి బీహారీలను ఎందుకు తరిమి కొడతారని నిలదీయండి అని రాహుల్ ప్రజలకు పిలుపునిచ్చారు. మేము బీహార్‌లో బీజేపీని, ఆరెస్సెస్‌ను నిలువరిస్తాం. ఒకటి తర్వాత మరొక రాష్ట్రం నుంచి బీజేపీని పెకలించివేస్తాం అని అన్నారు. మహా కూటమిని బలోపేతం చేస్తామని... నితీశ్ మళ్లీ సీఎం అవుతారని యువరాజు జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఉపాధి కల్పించకపోగా.. ఆయన హయాంలో కిలో కందిపప్పు ధర 200లకు చేరుకున్నదని రాహుల్ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles