Jana Sena attack Chandrababu for not inviting Pawan Kalyan personally

Unidentified miscreants create hungama at pawan kalyan s house

unidentified miscreants create hungama at Pawan Kalyan's house, Jana Sena, Chandrababu Naidu, Pawan Kalyan, KCR, Jana Sena Workers, Amaravati Fete, Amaravati, Jana Sena criticized Chandrababu, AP Capital Amaravati foundation

Jana Sena cadre workers criticized Chief Minister Chandrababu Naidu for not extending personal invitation to Pawan Kalyan for the AP Capital Amaravati foundation stone laying ceremony.

పవన్ కల్యాన్ నివాసం వద్ద గుర్తు తెలియని అగంతకులు హంగామా

Posted: 10/21/2015 03:32 PM IST
Unidentified miscreants create hungama at pawan kalyan s house

జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇంటి వద్ద కొందరు యువకులు హంగామా సృష్టించారు. మద్యం మత్తులో వచ్చిన పలువురు గుర్తు తెలియని యువకులు పవన్ కల్యాన్ నివాసం వద్ద రచ్చ రచ్చ చేశారు. గేటు వద్ద కాపలా వున్న వాచ్ మెన్ పై దాడులకు పాల్పడుతుండగా బౌన్సర్లు వచ్చి అడ్డుకున్నారు. బౌన్సర్ల పైకి కూడా యువకులు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఎదురు తిరిగిన బౌన్సర్లు వారిని పట్టుకునేందుక యత్నించారు. బౌన్సర్ల నుంచి తప్పించుకున్న యువకులు పలాయనం చిత్తగించారు.

అయితే జరిగిన ఘటనపై పవన్ కల్యాన్ బౌన్సర్లు బంజారాహిల్స్ ఫోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ లో వున్న పవన్ కల్యాన్.. దాని నిమిత్తం గుజరాత్ లో వున్నారు. అయితే యువకులు పవన్ కల్యాన్ ఇంటికి ఎదుట హంగామా సృష్టించినందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. సోలీసులు సిసిటీవీ ఫూటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో వున్నారు.

ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పవన్ కల్యాన్ అభిమానులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావడానికి కారణమైన పవన్ కల్యాన్ ను.. ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారని వారు అరోపించారు. టీడీపీకి అండగా వున్న రామోజీరావు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లను స్వయంగా ఆహ్వానించిన చంద్రబాబు.. తమ ప్రభుత్వం అధికారంలో వుండటానికి కారణమైన మూలవిరాట్టులాంటి పవన్ కల్యాన్ కు మాత్రం మంత్రులతో ఆహ్వానాలు పంపుతారా అంటూ వారు నిలదీస్తున్నారు. తిరుపలి సహా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, విజయవాడ, రాజమండ్రి సహా పలు ప్రాంతాల్లో పవన్ అభిమానులు నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  Chandrababu Naidu  Pawan Kalyan  KCR  Jana Sena Workers  Amaravati Fete  Amaravati  

Other Articles