All set for new Andhra capital Amaravati's ground breaking

All set for new andhra capital amaravati s ground breaking

Amaravati, Chandrababu Naidu, Modi, Sai Kumar, Amaravati inauguration, AMaravati News, Amaravati updates, Amaravati inauguration ceremony

The stage is set for the for the foundation stone laying ceremony of new Andhra Pradesh capital Amaravati on Thursday. Prime Minister Narendra Modi will lay the foundation stone at at Uddandarayunipalem village in Guntur district on the occasion of Dussehra.

అమరావతితో... ఆంధ్రుల నవ శకానికి అంకురార్పణ

Posted: 10/21/2015 04:57 PM IST
All set for new andhra capital amaravati s ground breaking

అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మాత్రమే కాదు, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవం కూడా. విభజనతో సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలంటే రాజధాని అత్యవసరం. మన రాష్ట్రం.. మన  రాజధాని.. ఇది ప్రజారాజధాని... అదే అమరావతి. ఎప్పుడో 2000 ఏళ్ల క్రితమే  ఆంధ్రుల రాజధానిగా  విలసిల్లిన ధాన్యకటకం (ధరణికోట) ఆ తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది.  ఈ పట్టణం పేరు  తిరిగి స్పురించేలా  నేడు నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం. అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలుగువిశేష్ అందిస్తున్న అమరావతి ఫుల్ కవరేజ్ స్టోరీ... మీ కోసం..

‘అమరావతి’ శంకుస్థాపనలో డైలాగ్ కింగ్ వాయిస్..
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ శంకుస్థాపన నిర్వహణను డైలాగ్ కింగ్ సాయికుమార్ కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన ఏర్పాట్లపై సీఎం క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ విషయంపై చర్చించారు. ఇదిలావుండగా.. 40 ఏళ్లుగా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సాయికుమార్.. ఈ ప్రతిష్టాత్మక రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరిస్తుండడం.. ఆయన జీవితంలో అదో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ రాజధాని నిర్మాణంలో భాగంగా సాయికుమార్ వాయిస్ ఓ మైలురాయిగా నిలవనుంది. అటు ఈ అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వానికి సాయికుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ.. సంతోషం వ్యక్తం చేశారు.

సునీతకు యాంకరింగ్ అవకాశం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవానికి యాంకరింగ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలుగు సినీ గాయని సునీత అన్నారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆమె తన భావనలను పంచుకున్నారు. చారిత్రాత్మక అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి యాంకిరంగ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. నటుడు సాయి కుమార్‌తో పాటు సునీత ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించనున్నారు. ప్రజా రాజధాని అమరావతి ఎలా వెలిగిపోతుందో ఇప్పుడే తెలిసిపోతోందని ఆమె అన్నారు. కాస్తా నెర్వస్‌గా ఉన్నా కార్యక్రమానికి తగినట్లుగా ప్రిపేర్ అయినట్లు ఆమె తెలిపారు. తనకు అవకాశం రావడం గొప్పగానూ గర్వంగానూ అనిపించిందని చెప్పారు.

అమరావతికి బస్సులు పంపిన తమిళ సూపర్ స్టార్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన భారీ ఎత్తున జరగనుంది. ఇందుకోసం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు బస్సులను పంపించారు. వివిఐపిల కోసం రజనీకాంత్ ఈ బస్సులను పంపించారు. గతంలో రజనీకాంత్ తాను నటించిన శివాజీ సినిమాను హైదరాబాదులో చంద్రబాబుకు చూపించారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సరికొత్త రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు జయలలిత అభిలషించారు. ఈ మేరకు ఆమె చంద్రబాబుకు లేఖ రాశారు. శంకుస్థాపన ఏ ఆటంకాలూ లేకుండా పూర్తి కావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేంతటి ప్రాధాన్యతను సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. కొత్త రాజధానికి బాబు చేస్తున్న కృషి ఫలితాలను అందించాలని ఆశించారు. అనివార్య కారణాల వల్ల తాను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్టు పేర్కొన్నారు.

రాజధాని శంకుస్థాపన ప్రాంగణం విశేషాలు
* లక్షపైచిలుకు కూర్చునేలా గ్యాలరీలు
* ప్రధాన వేదికల ముందు 6వేల మంది ప్రముఖులు
* భూములిచ్చిన రైతులకూ సముచిత స్థానం
* ప్రధాన వేదికకు కుడివైపున ముందు భాగంలో ‘మన మట్టి- మన నీరు’ కార్యక్రమంలో భాగంగా సేకరించిన మట్టి, నీటిని ఉంచేందుకు వలయాకారం నిర్మాణం చేపట్టారు.
* దానికి కొంచెం వెనుక భా గంలో ’అమరావతి సంకల్పజ్యోతి’ ఉంచేందుకు వీ లుగా స్థూపాన్ని నిర్మిస్తున్నారు.
* ఎడమ వైపున ముందు భాగంలో అమరావతి శంకుస్థాపన ఫలకాన్ని నిర్మిస్తున్నారు.
* ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, ఇతర విశిష్ట అతిథులు ఆసీనులయ్యే ప్రధాన వేదికను ధవళ వసా్త్రలతో అలంకరిస్తున్నారు.
* అత్యంత ప్రముఖులు కూర్చునే రెండు వేదికల పైకప్పులను లేత పసుపు, తెలుపు వసా్త్రల తో తీర్చిదిద్దనున్నారు.
* వీటికి అభిముఖంగా, కొం చెం దూరంలో ఏర్పాటయ్యే ప్రముఖులు కూర్చునే టెంట్ల పైకప్పులను గంధం, లేత పసుపుపచ్చ రంగులున్న వసా్త్రలతో అలంకరిస్తున్నారు.
* రైతు కుటుంబాలు ఆసీనులయ్యే మధ్య భాగంలోని భారీ షెడ్ల పైకప్పులకు తెలుపు వస్త్రం ఏర్పాటు చేస్తుండగా, ఇతర టెంట్లను పసుపుపచ్చ రంగు షామియానాలతో వేస్తున్నారు.
* వీఐపీలు కూర్చునే టెంట్లలో నీలం, రైతులు ఆసీనులయ్యేందుకు లేత పసుపు పచ్చరంగు కుర్చీలు వేస్తున్నారు.
* శంకుస్థాపన సమయంలో వర్షం వచ్చినా ప్రాంగణం చిత్తడిగా మారకుండా ఇసుకను చల్లించారు.

శంకుస్థాపనకు 30 ప్రత్యేక వైద్య బృందాలు
* పది ఆస్పత్రుల్లో 250 పడకలు రిజర్వ్‌
* గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉద్దండరాయునిపాలెం ప్రధాన వేదిక వద్దకు వచ్చే వరకూ 8 కాన్వాయ్‌ టీమ్‌లను సిద్ధం చేస్తోంది. ప్రధాన వేదిక వద్ద, సమీప ప్రాంతాల్లో ఆరోగ్య శా ఖ 25-30 వైద్య బృందాలను ఏర్పాటు
* ఎంఐపీలు, వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేకంగా ‘కార్డియో అంబులెన్సు’ను సిద్ధం చేశారు.
* శంకుస్థాపన జరిగే 22న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ గుంటూ రు జిల్లాలో పది ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 50 ఐసీయూ పడకలను, మరో 200 జనరల్‌ వార్డు పడకలను రిజర్వ్‌ చేసి ఉంచారు.

పాస్ ఉంటేనే అమరావతికి అనుమతి..
* మీడియాకు పింక్‌ కలర్‌పాస్‌, అతిథులకు బ్లూ, రెడ్‌ కలర్‌ పాస్‌లు
* మీడియాకు ఇచ్చే పాస్‌లపై పింక్‌ కలర్‌లో ‘పి’ అని ముద్రించి అందించనున్నారు.
* ట్రిపుల్‌ ఏ విభాగం కింద నిర్ణయించిన అతిథులను రెండు విభాగాలుగా విభజించి బ్లూ, రెడ్‌ కలర్‌ పాస్‌లు అందిస్తారు
* బ్లూ విభాగంలో ప్రముఖ పారిశామ్రికవేత్తలు, వ్యాపారవేత్తలు, బ్యాంక్‌లకు సంబంధించిన ఉన్నతాధికారులు
* రెడ్‌ విభాగంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు తదితరులు ఉంటారు.
* డబుల్‌ ఏ విభాగం అతిథులనూ రెడ్‌, బ్లూ పాస్‌హోల్డర్లుగా విభజించారు.
* పాస్‌లు మరచిపోయి వచ్చినా స్థానికంగా వారికి కేటాయించిన లైజనింగ్‌ అధికారి వాటిని సమకూర్చాల్సి ఉంది.
* లైజనింగ్‌ ఆఫీసర్‌ పాస్‌పై ఎల్‌.ఓ. అని, మీడియాకు పి అని, రైతులకు ఎఫ్‌ అని, డ్యూటీ అధికారులకు ఓడీ(ఆన్‌డ్యూటీ) అని అక్షరాలు ముద్రించి ఉండటంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర, అమరావతి హోలోగ్రాంలు ఉంటాయి.

ఇప్పటి వరకు ఖరారైన అతిథులు వీరు..
అమరావతి శంకుస్థాపనకు వస్తున్నట్టు ఆహ్వానాలు అందుకున్న 121 మంది నుంచి ఏపీ అధికారులకు సమాచారం అందింది. వీరిలో పలువురు గవర్నర్‌లు, విదేశీ అంబాసిడర్లు, సుప్రీం కోర్టు జడ్జీలు, పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు, ప్రముఖులు ఉన్నారు. చంద్రబాబు మిత్రుడు, పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, అస్సాం, నాగాలాండ్‌ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ పీబీ ఆచార్య, వెనిజులా అంబాసిడర్‌ ఆగస్టో మాంటియిల్‌ దంపతులు, సుప్రీం కోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ, బెల్జియం, బల్గేరియా అంబాసిడర్‌లు అమరావతికి వస్తున్నట్టు సమాచారమిచ్చారు. బంగ్లాదేశ్‌, బ్రిటన్, రువాండా హైకమిషనర్లు, కెనడా ట్రేడ్ కమిషనర్, జపాన్ ప్రతినిధిగా చీఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ ఆర్గనైజేషన్‌ హాజరు కానున్నారు. కోనేరు హంపి, వీవీఎస్ లక్ష్మణ్, తోషిబా ఇండియా ఎండీ కెంజీ యురేయ్‌, వీ2 ఎక్స్‌ పో సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాజా గంజుపల్లి, దాల్మియా సిమెంట్స్‌ మేనేజింగ్ డైరెక్టర్ గోనె పునీత్‌ దాల్మియా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ప్రతినిధి మసాయు కికుబో, వాల్‌ మార్ట్‌ ఇండియా ఉపాధ్యక్షుడు రజనీష్‌ కుమార్‌, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్ జీఎం రావులు రానున్నారు. లాస్‌ ఏంజెల్స్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయ భాస్కర్‌, సుమాటో కార్పొరేషన్‌ ప్రతినిధి హిరోయో తదితరులతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు వస్తున్నారు. వీరందరికీ మరువలేని ఆతిథ్యం ఇవ్వాలని, ఏ లోటూ రాకుండా చూసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి శంకుస్థాపనకు వస్తున్న వారిలో.... అపోలో ప్రతాప్ రెడ్డి, ఏషియన్ పేయింట్స్ ప్రతినిధి, ఎస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉఫాధ్యక్షులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులు ఉన్నారు.

అమరావతి శంకుస్థాపనలో హైలెట్ గా కల్చరల్ ఈవెంట్స్..
అమరావతి శంకుస్థాపన సమయంలో సుమారు 3 గంటల పాటు సాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పలువురు కళాకారులు తమ ప్రతిభను చాటనున్న సంగతి తెలిసిందే. అన్నింటికన్నా, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రచించిన 'జయహో అమరావతి' అనే పాటకు కూచిపూడి నృత్య రూపకం సిద్ధమవుతోంది. దాదాపు 10 నిమిషాలు సాగే ఈ రూపకం అందరినీ ఆకర్షిస్తుందని రిహార్సల్స్ చూసిన వారు చెబుతున్నారు. ప్రపంచ దేశాల రాజధానులు కూడా అచ్చెరువొందేలా ఆంధ్రుల రాజధాని అమరావతి వర్థిల్లాలంటూ, కృష్ణా నది తీరాన అమరావతి ధగధగలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా అభివృద్ధి సాధించాలంటూ సాగుతుందీ గీతం. తెలుగునాట వివిధ రంగాల ప్రముఖులను కీర్తిస్తూ, ప్రదర్శన సాగుతుంది. "జయజయహే అమరావతి, ఆంధ్ర రాజధాని, చంద్రకళా ప్రతిభాకృతీ, ఇంద్రభవన శ్రేణి..." అంటూ సాగే పాటలో భాగంగా వేదికపై 100 మందికి పైగా కూచిపూడి నృత్య కళాకారులు నర్తించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles