SC may limit time for bursting fire crackers during Diwali after plea by 3 infants

Sc mulls limiting cracker bursting time on diwali

Supreme Court on Diwali, Supreme Court on fire cracker bursting, SC time limit time for bursting fire crackers, SC limiting cracker bursting time on Diwali, Aarav Bhandari, Arjun Gopal, diwali, Supreme Court, limit fire cracker bursting

The Supreme Court said it was seriously considering to limit fire cracker bursting on Diwali day between 5pm and 10pm

దీపావళి పండగ రోజున.. పరిమితం కానున్న పటాసుల మోతలు..!

Posted: 10/17/2015 02:03 PM IST
Sc mulls limiting cracker bursting time on diwali

దీపావళి.. రాక్షస అగ్రగన్యుడి నరకాసురుడిని. శ్రీమహావిష్ణువు దశావతారాల్లోని శ్రీకృష్ణుడి అవతారంలో వెళ్లి.. యుద్దం చేసి సొమ్మసిల్లగా, సత్యభామాదేవి నరకాసురుడిని వధించి.. యావత్ భూమండల ప్రజలకు రాక్షస పీడ నుంచి విముక్తి కల్పించిన రోజు. అదే ఆనందంలో అమావాస్య రోజున తిరిగి తమ రాజ్యానికి వస్తును సత్యభామ శ్రీకృష్ణులకు పుర ప్రజలు.. వరుస దీపాల కాంతులతో స్వాగతం పలికిన దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇదే క్రమంలో మందుగుండును పేల్చి వారి అనందాన్ని వ్యక్తపరుస్తారు. ఇదే అనావాయితీగా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళిగా ఆచరించరిస్తుంటారు ప్రజలు. హిందూ, ముస్తి, క్రైస్తవులన్న తారాతమ్య బేధాలకు దూరంగా అన్ని వర్గాల ప్రజలు, కలసిమెలసి జరుపుకునేదే దీపావళి పండగ.

కాలక్రమేనా ఈ పండగలో తైలం దీపాలకు బదులుగా విద్యుత్ దీపాలు భారీ సంఖ్యలో ఆగమనం చేశాయి. అయితే పటాసులలో కూడా మితిమీరిన శబ్దకాలుష్యం, వాయుకాలుష్యంతో కూడిన టపాసులు చోచ్చుకోచ్చాయి. తీరా పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే.. అప్పు చేసి పప్పుకూడు అన్నట్లుగా.. డబ్బున్నా లేకున్నా..  టపాసులను మాత్రం కాల్చి.. ఆ వీధిలో లేక ఆ గ్రామంలో తమదే పైచేయి అని నిరూపించుకోవాలని పోటీ పడుతుంటారు. ఇక అందరిలా తమ పిల్లలు కూడా సంబరంగా పండగ జరుపుకోవాలని ప్రతీ కుటుంబంలోని తల్లిదండ్రులు తమ శక్తికొలది టపాసులను కొనుగోలు చేసి మరీ కాలుస్తుంటారు. ఈ క్రమంలో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటీషన్.. వృధాగా డబ్బు తగిలేయడం విషయాన్ని పక్కన బెట్టి.. దీపావళికి ఇష్టమొచ్చిన వేళల్లో కాకుండా నిర్ణీత వ్యవధిలో మాత్రమే టపాకులు కాల్చేలా ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. సంచలనాత్మక రీతిలో పాలుతాగే పసిపిల్లలు గత నెలలో దాఖలుచేసిన పిటిషన్ ను  విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఈ నెల 27 ఖచ్చితమై తీర్పును వెలువరించే అవకాశాలున్నాయి.

'ఇంకా అభివృద్ధి చెందని మా ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాలు.. టపాకులు ద్వారా జనించే శబ్ధ, ధ్వని కాలుష్యాల వల్ల ఎంతగా అల్లాడిపోతాయో ఆలోచించండి' అంటూ ఆరు నెలల వయసున్న అర్జున్ గోపాల్, ఆరవ్ భండారీ, 14 నెలల వయసున్న జోయా రావ్ భాసిన్ అనే చిన్నారులు తమ న్యాయవాద తండ్రుల ద్వారా సెప్టెంబర్ 30న పిటిషన్ దాఖలు చేశారు. చిన్నారుల అభ్యర్థనలోని పలు అంశాలను చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తు, జస్టిస్ అమితాబ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం కూలంకషంగా పరిశీలించింది. పిల్లలు వ్యక్తపరిచిన ఆందోళన సహేతుకంగానే ఉందని, తగిన చర్చలు చేపట్టేలా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడాల్సిందిగా సొలిసిటర్ జనరల్ రజిత్ కుమార్, అదనపు సొలిసిటర్ జనరల్ మనిందర్ సింగ్ లను కోర్టు ఆదేశించింది.

దీపావళి పండుగనాడు టపాకులు పేల్చే కార్యక్రమాన్ని రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరగా.. రెండు గంటలు చాలా తక్కువ సమయమని, అందుకు కనీసం 5 గంటలైనా వేడుక జరుపుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. టపాకుల పేల్చివేతక వ్యవధిని సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్ధారిస్తే సరిపోతుందని ఒక నిర్ధారణకు వచ్చింది. తరుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తెలిపే వివరాలను బట్టి అదే రోజు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aarav Bhandari  Arjun Gopal  diwali  Supreme Court  limit fire cracker bursting  

Other Articles